
మరోసారి పాట పాడిన బాలయ్య.. జనం ఎక్స్ప్రెషన్స్ మామూలుగా లేవు
విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ నిర్వహించారు. ట్రస్ట్ నిర్వాహకురాలు నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సారథ్యం వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలను కొనియాడారు. శివమణి డ్రమ్స్ వాయించగా.. బాలయ్య మరోసారి పాట పాడి అలరించారు.