Asianet News TeluguAsianet News Telugu

దాచేపల్లిలో ఉద్రిక్తత... ఎమ్మెల్యేను ప్రశ్నించిన మహిళల ఇళ్లపై కర్రలు, రాళ్లతో దాడి

గురజాల : పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి రోడ్డుకోసం ప్రశ్నించినందుకు తమ ఇళ్లపై వైసిపి నాయకులు రాళ్లు, కర్రలతో దాడి చేసారని దాచేపల్లి వాసులు ఆరోపిస్తున్నారు. 

First Published Feb 5, 2023, 10:51 AM IST | Last Updated Feb 5, 2023, 10:51 AM IST

గురజాల : పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి రోడ్డుకోసం ప్రశ్నించినందుకు తమ ఇళ్లపై వైసిపి నాయకులు రాళ్లు, కర్రలతో దాడి చేసారని దాచేపల్లి వాసులు ఆరోపిస్తున్నారు. దాచేపల్లి మండలం శ్రీనివాసపురం గ్రామంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలోనే కొందరు మహిళలు రోడ్డు బాగోలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అయితే అక్కడినుండి ఎమ్మెల్యే వెళ్లిపోయాక ప్రశ్నించిన మహిళల ఇళ్లపై కొందరు రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. అంతేకాదు ఇళ్లలోకి చొరబడి దొరికిన వారిని కొట్టడంతో పాటు బీరువాలోని బంగారం, నగదు ఎత్తుకెళ్లారని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేను ప్రశ్నించామన్న కోపంతో స్థానిక వైసిపి నాయకులు తమ ఇళ్లపై దాడికి పాల్పడినట్లు... పొలీసుల కనుసన్నల్లోనే ఇదంతా జరిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.