Agnipath Protests : గుంటూరు రైల్వే స్టేషన్ వైపు దూసుకొచ్చిన ఆర్మీ అభ్యర్థులు.. విజయవాడలో హై అలర్ట్...(వీడియోలు

విజయవాడ : ఆర్మీలో ప్రవేశపెట్టనున్న ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో రైల్వే శాఖ, బెజవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. 

Share this Video

విజయవాడ : ఆర్మీలో ప్రవేశపెట్టనున్న ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో రైల్వే శాఖ, బెజవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వే స్టేషన్, బస్టాండ్‌తో పాటు పలు ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు. విజయవాడ రైల్వే స్టేషన్‌కు అదనంగా 300 మంది పోలీసులు నియమించారు. రైల్వే స్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాలు, రైల్వే ట్రాక్‌ల వెంబడి పోలీసులు తిరుగుతున్నారు. టికెట్లు ఉన్నవారినే స్టేషన్‌లోకి అనుమతిస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. రైల్వే స్టేషన్ అన్ని గేట్లు వద్ద అదనపు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా గుంటూరులో ఆర్మీ అభ్యర్థులు రైల్వే స్టేషన్ వైపు దూసుకొచ్చారు. దీంతో కొత్తపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. దూసుకొచ్చిన 20 మంది ఆర్మీ విద్యార్థుల అరెస్టు చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద కట్టుదిట్టమైన భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Related Video