AP ticket price row: రాజకీయాల్లో జగన్ సీతయ్య, కారణం ఇదీ...

సినిమా టికెట్ల ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొండి వైఖరి అవలంబిస్తున్నారు. 

Share this Video

సినిమా టికెట్ల ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొండి వైఖరి అవలంబిస్తున్నారు. సినిమా టికెట్ల ధరలను పెంచడానికి ఏ మాత్రం ఆయన అంగీకరించడం లేదు. ధరలను నియంత్రిస్తూ జారీ చేసిన జీవో నెంబర్ 35ను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. దాన్ని డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు. అయితే, సింగిల్ బెంచ్ రద్దు చేసినప్పటికీ YS Jagan సినిమా రంగాన్ని నియంత్రించడానికి మరో వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. థియేటర్లను అధికారులతో తనిఖీలు చేయిస్తున్నారు. దాంతో నిబంధనలను పాటించని థియేటర్లను సీజ్ చేస్తున్నారు. సామ్ శింగరాయ్ సినిమా విడుదల నేపథ్యంలో హీరో Nani చేసిన వ్యాఖ్యలను ఆ వివాదాన్ని మరింతగా పెంచాయి. జగన్ మొండిపట్టు వెనక రాజకీయ కారణాలు ఏమిటో చూద్దాం.

Related Video