పీఆర్సీ జీవోలపై సీరియస్... ఆందోళనకు సిద్దమైన సచివాలయ ఉద్యోగులు
అమరావతి: పీఆర్సీ, ఫిట్ మెంట్,హెచ్ఆర్ఏ లపై ప్రభుత్వం విడుదల చేసిన జీఓలపై సచివాలయ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. సచివాలయంలో ఉద్యోగుల సంఘం ఈసీ మీటింగ్ నిర్వహించింది. ఉద్యోగులకు అన్యాయం చేసేలా వున్న జీవోలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉద్యోగసంఘాల నాయకులు డిమాండ్ చేసారు. ఈ క్రమంలోనే సచివాలయ ఉద్యోగులు ఆందోళనకు సిద్దమయ్యారు. పీఆర్సీ జీఓలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. తమ అభ్యంతరాలను తెలియజేసేందుకు చీఫ్ సెక్రటరీ వద్దకు నల్ల బ్యాడ్జీలతో వెళ్లాలని నిర్ణయించారు. వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రేపు లేదా ఎల్లుండి నుంచి ఉద్యమించేందుకు సన్నద్దంగా ఉన్నామని ఉద్యోగుల సంఘం నాయకులు హెచ్చరించారు.