ఆంధ్రప్రదేశ్ : కరోనాపై గవర్నర్ ఉన్నతస్థాయి సమీక్ష..అప్రమత్తం కావాలి...

కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. 

Share this Video

కరోనా వ్యాప్తిని అరికట్టే క్రమంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. ప్రభుత్వం, పౌర సమాజం సంయుక్త భాగస్వామ్యంతోనే ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకురాగలుగుతామన్నారు. శనివారం రాజ్ భవన్ వేదికగా గవర్నర్ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, కరోనా రాష్ట్ర ప్రత్యేక అధికారి విజయ రామరాజు, కేంద్రం నుండి ప్రత్యేకంగా నియమించ బడిన ప్రత్యేక అధికారి సురేష్ కుమార్, గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఈ సమీక్షలో పాల్గొన్నారు. 

Related Video