మేం పరీక్షలు పెడతాం... మీరు కూడా పెట్టండని కేంద్రాన్ని కోరాం: ఏపి విద్యాశాఖ మంత్రి సంచలనం
అమరావతి: విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని సిఎం జగన్మోహన్ రెడ్డి 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
అమరావతి: విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రత దృష్టిలో పెట్టుకుని సిఎం జగన్మోహన్ రెడ్డి 10వ తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
కరోనా పరిస్థితి చక్కబడ్డాక తిరిగి పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని... త్వరలోనే పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు. ఉన్నత చదువులకు ఇంటర్, టెన్త్ పరీక్షలు చాలా అవసరమని... అందువల్లే
విద్యార్థులు నష్టపోకుండా పరీక్షలు నిర్వహించాలని చూస్తున్నామన్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా సీబీఎస్ఈ పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తోందన్నారు. సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించాలని కూడా తాము కోరామన్నారు. కోవిడ్ నిబందనలు పాటిస్తూనే పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో టీచర్లు కూడా స్కూల్స్ కి రావాల్సిన అవసరం లేదన్నారు. అయితే 10వ తరగతి విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా క్లాసులు ఉంటాయని మంత్రి సురేష్ వెల్లడించారు.