సీఎం జగన్ విదేశీ పర్యటన షురూ... గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో పయనం
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ బయలుదేరారు. ఉదయమే తాడేపల్లి నివాసం నుండి తాడేపల్లి విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో పయనమయ్యారు. ఇవాళ (శుక్రవారం) రాత్రికి ఆయన దావోస్ చేరుకోనున్నారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ బయలుదేరారు. ఉదయమే తాడేపల్లి నివాసం నుండి తాడేపల్లి విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో పయనమయ్యారు. ఇవాళ (శుక్రవారం) రాత్రికి ఆయన దావోస్ చేరుకోనున్నారు. 22వ తేదీన అంటే ఆదివారం జరిగే సదస్సులో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు అవకాశాలగురించి ప్రసంగించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి, సీఎం కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ , తదితరులు దావోస్ సదస్సులో పాల్గొననున్నారు.