AP Budget 2025: బాబు పాలనలో కనిపించేవి ఆ రెండే: జగన్ | YSRCP Vs TDP | Asianet News Telugu
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు పేదలకు ఇచ్చింది గుండు సున్నా అని విమర్శించారు. జగన్ కంటే ఎక్కువ సంక్షేమం చేస్తామన్న బాబు, పవన్.. ప్రజలను నిలువునా ముంచారన్నారు. సూపర్ సిక్స్ పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా మోసం చేశారన్నారు. 9 నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలిచ్చినట్లు అబద్దాలు చెబుతున్నారని ఆక్షేపించారు. గవర్నర్ నోట కూడా అబద్దాలు చెప్పించారన్నారు.