userpic
user icon

దుందుడుకు చర్యలతో.. ప్రభుత్వం చేతులు కాల్చుకుంది.. విష్ణువర్ధన్ రెడ్డి

Bukka Sumabala  | Published: May 29, 2020, 4:33 PM IST

ఏపీ హైకోర్టు తీర్పును బిజేపి రాష్ట్ర పార్టీ స్వాగతిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఎన్నికల కమిషనర్‌ మార్పు, స్థానిక ఎన్నికల్లో అవకతవకలు పై మొదటి నుండి భారతీయ జనతా పార్టీ  రాష్ట్రప్రభుత్వ నిరంకుశ వైఖరిని వ్యతిరేకిస్తోందన్నారు. రాజ్యాంగ విరుద్దమైన చర్యలకు, నియంతృత్వ పోకడలకు చెంపపెట్టు ఈరోజు హైకోర్టు తీర్పు. ప్రజాస్వామ్యానికి ఎంతటి స్థాయి వారైనా కట్టుబడి ఉండాల్సిందే. ఇకనైనా వైకాపా ప్రభుత్వం నియంత పాలన విడిచిపెట్టి ప్రజల కోసం పనిచేస్తే మంచిది. వ్యవస్థలను పాడుచేయాలనే ఆలోచన విరమించుకోవాలి. ఎన్నికల కమిషనర్‌గా మరో సారి నియమించబడిన నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ గారు నిజాయతీగా పనిచేయాలి కోరుతున్నామన్నారు.

Read More

Video Top Stories

Must See