Asianet News TeluguAsianet News Telugu

ఏపీ బంద్... టిడిపి శ్రేణుల ఆందోళనలు, పోలీసుల అరెస్టులతో ఉద్రిక్తత

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా సోమవారం ఏపీలో బంద్ కొనసాగుతోంది.

అమరావతి : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా సోమవారం ఏపీలో బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలను టిడిపి శ్రేణులు మూసివేయిస్తున్నారు. కొందరు వ్యాపారులు స్వచ్చందంగానే షాపులను మూసేస్తున్నారు. ఇలా ఉండవల్లి సెంటర్ లో రోడ్డుపై బైఠాయించి వాహనాలను అడ్డుకుంటున్న టిడిపి శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, టిడిపి శ్రేణులకు వాగ్వాదం జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక విజయవాడలో టిడిపి నేతలు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. టిడిపి శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టేందుకు వెళుతున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ను పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ సమయంలో పోలీసులు, టిడిపి శ్రేణులకు మద్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.  విజయవాడ నగరంలో 144, 30 పోలీస్ శాఖ అమల్లో ఉందని...  నిరసనలు తెలపడానికి అనుమతి లేదని ఏసిపి విశాల్ గున్ని తెలిపారు. రాజకీయ పార్టీ నేతలు ఎవరు రోడ్లపైకి రావద్దని గున్ని సూచించారు. 

Video Top Stories