సత్తెనపల్లి టిడిపిలో లుకలుకలు.. అన్నా క్యాంటీన్ ల వివాదం..
పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా సత్తెనపల్లి టిడిపిలో లుకలుకలు కొనసాగుతున్నాయి.
పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా సత్తెనపల్లి టిడిపిలో లుకలుకలు కొనసాగుతున్నాయి. ఇది గమనించిన పార్టీ అధిష్టానం అందరు కలిసి కట్టుగా ముందుకు సాగలని చెప్పుకొచ్చింది. అయితే, అధిష్టానం ఆదేశాలు పట్టించుకోని నేతలు.. వర్గాల వారిగా అన్నా క్యాంటిన్ లు ఏర్పాటు చేశారు. నిన్న తెలుగు యువత నేత మల్లి ఆధ్వర్యంలో అన్నా క్యాంటిన్ ప్రారంభం చేయగా, నేడు మాజీ ఎమ్మెల్యే వై.వి. ఆంజనేయులు ఆధ్వర్యంలో అన్నా క్యాంటిన్ ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు పల్నాడు జిల్లాలో అన్నా క్యాంటిన్ ల ఏర్పాట్లు చర్చంశీయంగా మారింది.