ఆడుదాం ఆంధ్రా పెద్ద స్కాం.. 47 రోజుల్లో 120కోట్లు ఖర్చు: మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి | Asianet Telugu
గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం పెద్ద స్కాం అని ఏపీ క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... 47 రోజుల్లో రూ.120 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. ఆడుదాం ఆంధ్రాతో పాటు క్రీడా శాఖలో జరిగిన అన్ని అక్రమాలపై 45 రోజుల్లోనే విజిలెన్స్ ఎంక్వయిరీ, సీఐడీ ఎంక్వయిరీ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. దర్యాప్తు నివేదిక రాగానే అసెంబ్లీ ముందు పెడతామన్నారు. అక్రమాలకు బాధ్యులు ఎవరైనా చర్యలు తప్పవని స్పష్టం చేశారు.