Asianet News TeluguAsianet News Telugu

మహిళా దినోత్సవం రోజునే... రోడ్డెక్కిన రాజధాని మహిళలు

అమరావతి: గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే మహిళల రోడ్డెక్కారు. 

Mar 8, 2021, 12:08 PM IST

అమరావతి: గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే మహిళల రోడ్డెక్కారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ కనకదుర్గమ్మ చెంతకు  రాజధాని మహిళలు, రైతులు బయలుదేరారు. దీంతో వారిని పోలీసు బలగాలు అడ్డుకోవడంతో మహిళలు రోడ్లపైనే బైఠాయించారు. ఈ క్రమంలోనే పోలీసులతో మహిళలు వాగ్వివాదానికి దిగారు. తెల్లవారుజామున 4 గంటల నుండే ప్రతి గ్రామంలో పోలీసులు పహారా కాస్తున్నారు.