
MLA Arava Sridhar VS Victim
జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ఓ మహిళ చేసిన తీవ్రమైన ఆరోపణలు రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్నాయి. బాధితురాలు మీడియా ముందు వాస్తవాలు వెల్లడించగా, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అన్ని ఆరోపణలను ఖండిస్తూ ఇవన్నీ అసత్యమని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై కోర్టు ద్వారానే సమాధానం చెబుతానని ఆయన ప్రకటించారు. ఈ కేసు రాజకీయంగా మాత్రమే కాదు, సామాజికంగా కూడా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.