Asianet News TeluguAsianet News Telugu

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితి పెంపు... లోకేష్ సాధించిన నైతిక విజయం..

గుంటూరు : యువత భవిష్యత్ కు భరోసా ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని యువనేత నారా లోకేష్ చొరవతోనే ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితి వయసు రెండేళ్లకు పెంచనున్నట్లు ముఖమంత్రి జగన్ ప్రకటన లోకేష్ సాధించిన నైతిక విజయం తప్ప వేరొకటి కాదని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ అభ్యర్థులతో కలిసి అభినందించారు.
      
First Published Dec 24, 2022, 2:28 PM IST | Last Updated Dec 24, 2022, 2:28 PM IST

గుంటూరు : యువత భవిష్యత్ కు భరోసా ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని యువనేత నారా లోకేష్ చొరవతోనే ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థుల వయోపరిమితి వయసు రెండేళ్లకు పెంచనున్నట్లు ముఖమంత్రి జగన్ ప్రకటన లోకేష్ సాధించిన నైతిక విజయం తప్ప వేరొకటి కాదని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ అభ్యర్థులతో కలిసి అభినందించారు.
      
ప్రభుత్వం మూడున్నర సంవత్సరాల తర్వాత కంటితుడుపు చర్యగా 411 ఎస్సి పోస్ట్లు ,6100 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి  అభ్యర్థుల వయోపరిమితి విషయమై ఇటీవల ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసు రిక్ర్రుట్మెంట్ బోర్డ్ ఛైర్పర్సన్ కు డిసెంబర్ 12వ తారీఖున రాసిన లేక ఫలితమే ఈరోజు ముఖ్యమంత్రి ప్రకటించిన 2 ఏళ్ల వయపరిమితి సడలింపు అని గుంటూరు అరండేల్ పేటలోని జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుయువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ మరియు ఎస్సి కానిస్టేబుల్ అభ్యర్థులతో కలిసి యువత నేత నారా లోకేష్ చిత్రపటానికి ఇటీవల రాసిన లెటర్ కాపీని చూపుతూ పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలియజేసారు.