Asianet News TeluguAsianet News Telugu

ఏఈ ఇంట్లో సోదాలు.. భారీగా అక్రమాస్తులు, అవాక్కైన ఏసీబీ (వీడియో)

అతనో సాధారణ ఎలక్ట్రికల్ ఇంజనీర్...జీతం, గీతం కలిపి తాను సర్వీస్ చేసిన కాలంలో సంపాదిస్తే 2, 3 కోట్లు. కానీ అతను సంపాదించిన ఆస్తులు చూసి ఇప్పుడు ఏసీబీ అధికారులులే షాక్ అవుతున్నారు

అతనో సాధారణ ఎలక్ట్రికల్ ఇంజనీర్...జీతం, గీతం కలిపి తాను సర్వీస్ చేసిన కాలంలో సంపాదిస్తే 2, 3 కోట్లు. కానీ అతను సంపాదించిన ఆస్తులు చూసి ఇప్పుడు ఏసీబీ అధికారులులే షాక్ అవుతున్నారు.  

కొమ్మది ఎలక్ట్రికల్ ఏఈ నాగేశ్వరరావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంపై ఏసీబీ అధికారులు గురువారం ఆరు చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. నాగేశ్వరరావుకు విశాఖలో సీతమ్మధార, సీతంపేట, విశాలాక్షి నగర్, ఎంవీపీ కాలనీ, రాంబిల్లి ప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భూములు, ఇల్లు, స్థలాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

అలాగే 3 బ్యాంకు లాకర్‌లు సీజ్ చేశారు. 1991లో సర్వీసులో చేరిన నాగేశ్వరరావు 94లో ఏసీబీ అధికారులకు చిక్కి సస్పెండ్ అయ్యారు. 2012లో తిరిగి విధుల్లో చేరిన నాగేశ్వరరావు లంచం ఇవ్వనిదే మీటర్ కనెక్షన్ కూడా మంజూరు చెయ్యారనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఏసీబీ అధికారులు గుర్తించిన నాగేశ్వరరావు ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో వందల కోట్లు విలువ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ షకీలా భాను, విశాఖ డీఎస్పీ కే రంగరాజు, ఏసీబీ అధికారులు పాల్గొని సోదాలు జరుపుతున్నారు.

Video Top Stories