Asianet News TeluguAsianet News Telugu

కృష్ణానదిలో.. వరదలో చిక్కుకున్న 70 ఇసుక లారీలు..

కృష్ణాజిల్లా, నందిగామ నియోజకవర్గంలోని చెవిటికల్లు వద్ద కృష్ణా నదిలో తీసుకువెళ్లిన 70 లారీలు అకస్మాత్తుగా పెరిగిన వరదలో చిక్కుకోవడంతో ఆందోళన నెలకొంది. లారీలు ఇసుక లోడింగ్ కోసం వెడుతున్నారు. అయితే ఇలా వెళ్లే క్రమంలో లారీ డ్రైవర్లు ఎవరికి వారు తామే ముందుగా లోడ్ చేయించుకోవాలని పోటీపడి మరి వాగులోకి వెళ్లారు.ఈ సమయంలో రహదారి కూడా కొంత దెబ్బతిన్నది. అకస్మాత్తుగా కృష్ణానదికి వరద రావడంతో లారీలన్నీ అక్కడే చిక్కుకున్నాయి. వరద నీటిలో తిరిగి వెనక రాలేని పరిస్థితిలో లారీలో ఉండిపోయాయి. దీంతో లారీ డ్రైవర్లు, యజమానులు ఆందోళన చెందుతున్నారు. విషయం తెలిసిన  పోలీస్ ,రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలను ఏదో ఒక రకంగా ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.
 
First Published Aug 14, 2021, 10:48 AM IST | Last Updated Aug 14, 2021, 10:48 AM IST