సత్తెనపల్లిలో కలకలం... 150 మందికి పైగా గురుకుల విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్

సత్తెనపల్లి : పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థినులు అపరిశుభ్ర ఆహారం తిని హాస్పిటల్ పాలయ్యారు. 

Share this Video

సత్తెనపల్లి : పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థినులు అపరిశుభ్ర ఆహారం తిని హాస్పిటల్ పాలయ్యారు. సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురంలోని బిఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకునే విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. భోజనం చేసినతర్వాత దాదాపు 150 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురవడంతో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. విద్యార్థినులెవ్వరికీ ప్రమాదం లేదని... అందరూ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.

Related Video