నెల్లూరులో మార్చి 9న 105 శంకుస్థాపనలు: కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి

Share this Video

కూటమి ప్రభుత్వం గడిచిన 8 నెలల్లోనే ఎంతో అభివృద్ధి చేసిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. గ్రామీణ నియోజకవర్గంలో 191 కోట్ల రూపాయలతో ప్రగతి పనులు చేపట్టినట్టు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో మార్చి 9వ తేదీన భారీ ఘట్టం జరగబోతోందని చెప్పారు. రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా మార్చి 9న ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు 105 చోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ఉంటాయని వెల్లడించారు. ఇందులో 51 చోట్ల తాను, కూటమి నేతలు పాల్గొంటారని, మిగతా చోట్ల తన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో పాటు స్థానిక ప్రజలు పాల్గొంటారని వివరించారు.

Related Video