Asianet News TeluguAsianet News Telugu

బెదిరించి కోరిక తీర్చుకున్నాడు.. ఆమె సంసారంలో నిప్పులు పోసాడు

గృహిణి తన ఇంటిలో స్నానం చేస్తున్న సమయంలో ఆమెకు తెలియకుండా అక్కడే నివాసం ఉంటున్న వెంకటేష్‌ అనే 19 ఏళ్ల యువకుడు ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. రెండు రోజుల తర్వాత ఈ చిత్రాలను ఆమెకు చూపించి తాను చెప్పినట్లు వినాలంటూ ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశారు. 

youth arrested by police in boinapalli married women sucide case
Author
Hyderabad, First Published Sep 12, 2018, 10:45 AM IST

ఒక చక్కని సంసారాన్ని 19ఏళ్ల యువకుడు తన స్వార్థం కోసం నాశనం చేశాడు. వివాహిత స్నానం చేస్తుండగా వీడియోలు తీసి.. ఆమెను బెదిరించి తన కోరిక తీర్చుకున్నాడు. అక్కడితో ఆగకుండా వేధింపులు మరింత ఎక్కువ చేశాడు. భరించలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఈ నెల 4వ తేదీన బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌ మెయిన్‌గేట్‌ ముందు సబిత అనే మహిళ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. ఈ ఆత్మహత్యకు కారకుడైన వెంకటేష్‌ (19) అనే యువకుడిని మంగళవారం బోయినపల్లి పోలీసులు అరెస్టు చేశారు. 
బోయినపల్లి సీఐ విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం సూర్యపేట్‌ జిల్లా ఆత్మకూర్‌ మడలం దాచారం గ్రామంకు చెందిన ఎస్‌.వెంకటేష్‌ (19) అనే యువకుడు 2017లో హైదరాబాద్‌కు వచ్చి బేగంపేట్‌ సమీపంలోని అన్నానగర్‌ బస్తీలో ఓ బంగ్లాలో నివాసం ఉంటూ బేగంపేట్‌లోని క్రీమ్‌బెల్‌ ఐస్‌క్రీం కంపెనీలో బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఐదు నెలల క్రితం సబిత (26) అనే గృహిణి తన భర్త దినేష్‌తో పాటు తన ఇద్దరి పిల్లలతో కలిసి అన్నానగర్‌ బస్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకునివారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
 
   ఈ క్రమంలో రెండు నెలల క్రితం సబిత అనే గృహిణి తన ఇంటిలో స్నానం చేస్తున్న సమయంలో ఆమెకు తెలియకుండా అక్కడే నివాసం ఉంటున్న వెంకటేష్‌ అనే 19 ఏళ్ల యువకుడు ఆమె స్నానం చేస్తున్న దృశ్యాలను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. రెండు రోజుల తర్వాత ఈ చిత్రాలను ఆమెకు చూపించి తాను చెప్పినట్లు వినాలంటూ ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశారు. 

సబిత, వెంకటేష్‌కు సర్దిచెప్పినా వినిపించుకోలేదు.. సరికదా ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పెట్టడమే కాకుండా, ఆమె భర్తకు సైతం పంపి స్తానంటూ బెదిరించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె వెంకటేష్‌కు లొంగిపోయింది. అయితే ఈ విషయం కాస్తా సబిత భర్త దినేష్‌కు తెలిసి కొన్ని రోజులుగా వారి ఇద్దరి మధ్య గొడవలు మొదలు కావడంతో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. నీ విషయాన్ని బయటపెడతాను, నీ పిల్లల్ని చంపేస్తానంటూ వెంకటేష్‌ వేధించడం మొదలు పెట్టాడు. దీంతో సబిత తనలో తానే కుమిలిపోయింది. ఈ విషయంపై అప్పటికే ఓ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
 

పోలీసులు ఆమె విషయాన్ని పట్టించుకోకపోవడం, రోజూ వెంకటేష్‌ వేధింపులు ఎక్కువ కావడం, భర్త దూరం కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సబిత ఈ నెల 4వ తేదీ ఉదయం 10 గంటల ప్రాంతంలో బస్సులో బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పక్కన ఉన్న బస్‌స్టాప్‌కు చేరుకుంది. దాదాపు 20 నిమిషాల పాటు అక్కడే కూర్చుని ఉంది. ఇంతలో ఏమి జరిగిందో ఏమోగాని తనతోపాటు తెచ్చుకున్న పెట్రోల్‌ బాటిల్‌ తీసింది. పోలీస్‌స్టేషన్‌ ముందు పోలీసులు గాని, మరెవరూ లేని సమయంలో పరుగులు తీస్తూ పెట్రోల్‌ ను ఒంటిపై చల్లుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేసుకుంది. ఇది గమనించిన పోలీసులు మంటలను ఆర్పి హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె 70 శాతానికి పైగా కాలిపోయిందని, ఆస్పత్రివర్గాలు వెల్ల డించాయి. చికిత్స పొందుతూ రెండురోజుల తర్వాత సబిత ఆస్పత్రిలో మృతి చెందింది.
 
దీంతో కేసు నమోదు చేసుకున్న బోయిన్‌పల్లి విచారణ మొదలు పెట్టారు. ఈ క్రమంలో చనిపోయే ముందు తాను విసిరేసిన బ్యాగ్‌ను పరిశీలించిన పోలీసులకు సూసైడ్‌ నోట్‌ దొరికింది. తన చావుకు కారణం వెంకటేష్‌ అని అందులో పేర్కొంది. ఈ సూసైడ్‌ నోట్‌ ప్రకారం విచారణ మొదలుపెట్టిన పోలీసులకు పటాన్‌ చెరువు ఇస్నాపూర్‌ వద్ద వెంకటేష్‌ ఉన్నాడనే విశ్వసనీయ సమాచారం దొరికింది. మంగళవారం నిందితుడు వెంకటేష్‌ను మంగళవారం ఉదయం 8:30 గంటలకు అదుపులోకి తీసుకుని అతనివద్ద ఉన్న సెల్‌పోన్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదుచేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Follow Us:
Download App:
  • android
  • ios