నిజామాబాద్: వైద్యం పేరిట బాలికకు మత్తు మందిచ్చి  అత్యాచారం చేస్తున్న దొంగబాబాకు స్థానికులు దేహశుద్ది చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకొంది.

నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో బాలికను పరీక్షించిన వైద్యులు ఆమెపై అత్యాచారం జరిగిందని తేల్చారు. ఈ విషయమై బాలికను కుటుంబసభ్యులు  ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగు చూసింది.

also read:హోటల్‌లో గది బుక్ చేసి రమ్మన్నాడు, ఆ తర్వాత ముఖం చాటేశాడు: ప్రియుడిపై యువతి ఫిర్యాదు

భూత వైద్యం పేరుతో  నగరంలో 10 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్టుగా తేలింది. వైద్యం కోసం వచ్చిన మహిళలపై భూత వైద్యుడు  అత్యాచారానికి పాల్పడినట్టుగా గుర్తించారు.  

పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన విషయం వెలుగు చూడడంతో మహిళ సంఘాలు పెద్ద ఎత్తున  అక్కడికి చేరుకొని అతడిని చితకబాదారు. మూడు మాసాలుగా ఆ బాలికకు మత్తు మందిచ్చి  అత్యాచారం చేస్తున్నట్టుగా బాధితురాలు మీడియాకు వివరించింది.

మెడిటేషన్ నేర్పించే పేరుతో నిందితుడు  మహిళలపై  అత్యాచారానికి పాల్పడుతున్నట్టుగా మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని చీపుర్లు, కర్రలతో మహిళా సంఘాల నేతలు చితకబాదారు.