హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావును తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు దూరం పెట్టారనే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఆ ప్రచారాన్ని బలపరుస్తూ టీఆర్ఎస్ లో పరిణామాలు కూడా అదే రీతిలో చోటు చేసుకున్నాయి. 

తన తనయుడు, ఆపద్ధర్మ మంత్రి కేటీ రామారావును తన వారసుడిగా ముందుకు తెచ్చే ప్రయత్నంలో భాగంగా హరీష్ రావును కేసీఆర్ విస్మరించారని, దాంతో కేసిఆర్ కుటుంబంలో తగాదాలు చోటు చేసుకున్నాయని కూడా వార్తలు వచ్చాయి. 

అందుకు తగినట్లుగానే కొద్ది రోజుల పాటు హరీష్ రావు వార్తలు టీఆర్ఎస్ అధికారిక పత్రిక నమస్తే తెలంగాణలో అచ్చు కాలేదు. ద్వితీయ శ్రేణి టీఆర్ఎస్ నేతల ప్రకటనలకు కూడా చోటు కల్పించిన నమస్తే తెలంగాణ హరీష్ రావు వార్తలను ప్రచురించకపోవడంపై పెద్ద దుమారమే చెలరేగింది. 

పార్టీని, ప్రభుత్వాన్ని కేసిఆర్ పేరు మీద కేటీఆర్ నడిపించారనే అభిప్రాయం కూడా బలపడింది. హరీష్ రావును దూరం పెట్టడం వల్ల జరిగే నష్టాన్ని పసిగట్టి కేటీఆర్ హరీష్ రావుతో చేతులు కలిపారని అంటారు. ఈ వివాదం ప్రభావం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పై ఏ విధమైన ప్రభావం చూపుతుందనే చర్చ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్‌ హరీష్‌కు ట్రబుల్స్: టీడీపీ, కాంగ్రెస్ మైండ్‌గేమ్

ఆధారాలున్నాయి: హరీష్ పై మరోసారి వంటేరు సంచలనం

పిచ్చి పట్టి మాట్లాడుతున్నాడు: వంటేరుకు హరీష్ కౌంటర్ (వీడియో)

రాహుల్ గాంధీతో హరీష్ టచ్ లో ఉన్నారు: వంటేరు సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ లో హరీష్ రావు ఇష్యూ: లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు

హరీష్ రావును కేసిఆర్ పార్టీ నుంచి గెంటేస్తారు: రేవంత్ రెడ్డి

సేఫ్ జోన్ లోకి కేటీఆర్: హరీష్ రావుపై కేసిఆర్ ప్లాన్ ఇదీ...

భావోద్వేగంతోనే రిట్మైర్మెంట్ కామెంట్ చేశా: మంత్రి హరీష్

హరీష్ టార్గెట్, కేటిఆర్ కు రస్తా: కేసిఆర్ ప్లాన్ ఇదీ...

కారులో హరీష్ రావు ఉక్కిరిబిక్కిరి: సిద్ధిపేటపై కేసిఆర్ కన్ను

హరీష్ వేదాంత ధోరణి: గులాబీ గూడు చెదురుతోందా?