Asianet News TeluguAsianet News Telugu

నేను తెలంగాణలో పర్యటిస్తే కేసీఆర్ ఎందుకు అభ్యంతరం: బాబు

తెలంగాణకు నేను వస్తే కేసీఆర్ ఎందుకు అభ్యంతరమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. 

why kcr objecting for my tour in telangana
Author
Hyderabad, First Published Nov 29, 2018, 11:19 AM IST

హైదరాబాద్: తెలంగాణకు నేను వస్తే కేసీఆర్ ఎందుకు అభ్యంతరమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. తెలంగాణలో మోడీ, అమిత్ షా, రాహుల్ పర్యటిస్తే అభ్యంతరం చెప్పని కేసీఆర్... నేను పర్యటిస్తేనే ఎందుకు వద్దంటున్నాడో చెప్పాలని ఆయన కోరారు.

హైద్రాబాద్ ‌లోని పార్క్ హయత్ హోటల్ లో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ, ఏపీ సీఎం చంద్రబాబునాయుడులు గురువారం నాడు సమావేశమయ్యారు.జాతీయ రాజకీయాలు, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు విషయమై రాహుల్ తో బాబు చర్చించారు. అనంతరం పలు పత్రికల ఎడిటర్లతో చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా పలు అంశాలను బాబు మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. తెలంగాణ అభివృద్ధి చెందాలనేదే తన ఆకాంక్షగా ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలకు తమ పార్టీ పాలసీని వివరించనున్నట్టు ఆయన తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఎన్డీయేతర పార్టీలను ఏకతాటి మీదకు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన చెప్పారు. డిసెంబర్ 10వ తేదీన ఎన్డీయేతర పార్టీల సమావేశాన్ని డిల్లీలో ఏర్పాటు చేస్తున్నామని బాబు వివరించారు. ఇప్పటికే ఎన్డీయేతర పార్టీలతో చర్చించినట్టు ఆయన గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

ప్రజా కూటమి దేశానికి దిక్సూచి: రాహుల్

తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదు: చంద్రబాబు

ఇక కేసీఆర్‌ ఫాం హౌజ్‌కే : సురవరం సెటైర్లు

బాబు, రాహుల్ నవ్వులు: ఖమ్మం సభలో ఆసక్తికర సన్నివేశం

ఖమ్మంకు బయలుదేరిన బాబు: రాహుల్‌తో కలిసి ఎన్నికల ప్రచారం

ఖమ్మం నుండి బాబు, రాహుల్ ఎన్నికల ప్రచారం

రంగంలోకి బాబు: రాహుల్‌తో పాటు తెలంగాణలో ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఒకే వేదిక‌ పైకి రాహుల్, బాబు

ప్రజాస్వామ్య రక్షణకు కలుస్తున్నాం: చంద్రబాబు

ప్రధాని ఎవరనేది అప్పుడే: దేవేగౌడతో భేటీ తర్వాత బాబు

బీజేపీయేతర ఫ్రంట్: దేవేగౌడ‌, కుమారస్వామిలతో బాబు భేటీ

బాబు ఫ్రంట్‌: ధర్మపోరాట దీక్షకు బీజేపీయేతర పార్టీలు

 

Follow Us:
Download App:
  • android
  • ios