ఖమ్మం:  తమ ముందు కేసీఆర్ తలవొంచాల్సిందేనని  ఎంఐఎం నేత అక్బరుద్దీన్ చేసినా కూడ ఆ పార్టీ తమకు మిత్రపక్షమేనని కేసీఆర్ చెప్పడం సహేతుకమా అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కోరారు.

 బుధవారం నాడు ఖమ్మంలో జరిగిన పీపుల్స్ ఫ్రంట్‌ ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు.ప్రజా కూటమిని గెలిపించాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కోరారు.దేశంలో  మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలు, దళితులు, మేధావులు, రచయితలపై దాడులు జరుగుతున్నట్టు సురవరం సుధాకర్ రెడ్డి చెప్పారు.

మైనార్టీలను గోరక్ష, గో మాసం పేరుతో చిత్ర హింసలు పెడుతున్నారని బీజేపీపై  విమర్శలు గుప్పించారు.

టీడీపీ కేంద్రంపై ప్రతిపాదించిన అవిశ్వాసానికి టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు చేసిందన్నారు. బీజేపీకి అనుకూలంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని సురవరం చెప్పారు.

ఎంఐఎం‌తో కేసీఆర్ మైత్రిని కొనసాగిస్తున్నాడని సురవరం చెప్పారు. కేసీఆర్ తమ ముందు తలవొంచాల్సిందేనని ఎంఐఎం నేతలు చెప్పడాన్ని  సురవరం సుధాకర్ రెడ్డి గుర్తు చేస్తూ...అలాంటి పార్టీని తమ మిత్రపక్షం అంటూ చెప్పడం సహేతుకమా అని ఆయన ప్రశ్నించారు.

బీజేపీతో అంటకాగిన కేసీఆర్‌ను ఓడించాలని  ఆయన ప్రజలను కోరారు. మరో వైపు ఇప్పటికే కేసీఆర్ ఓటమిని అంగీకరించినట్టు ఆయన చెప్పారు. గెలిస్తే ప్రజలకు పాలన ఇస్తాను.. లేకపోతే ఫాం హౌస్ కు వెళ్తానని కేసీఆర్ చెప్పడాన్ని ఆయన గుర్తు చేశారుకేసీఆర్ గెలిచినా ఓడినా కూడ పాం హౌజ్ కే పరిమితమయ్యే అవకాశం ఉందని సురవరం సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

బాబు, రాహుల్ నవ్వులు: ఖమ్మం సభలో ఆసక్తికర సన్నివేశం

ఖమ్మంకు బయలుదేరిన బాబు: రాహుల్‌తో కలిసి ఎన్నికల ప్రచారం

ఖమ్మం నుండి బాబు, రాహుల్ ఎన్నికల ప్రచారం

రంగంలోకి బాబు: రాహుల్‌తో పాటు తెలంగాణలో ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఒకే వేదిక‌ పైకి రాహుల్, బాబు

ప్రజాస్వామ్య రక్షణకు కలుస్తున్నాం: చంద్రబాబు

ప్రధాని ఎవరనేది అప్పుడే: దేవేగౌడతో భేటీ తర్వాత బాబు

బీజేపీయేతర ఫ్రంట్: దేవేగౌడ‌, కుమారస్వామిలతో బాబు భేటీ

బాబు ఫ్రంట్‌: ధర్మపోరాట దీక్షకు బీజేపీయేతర పార్టీలు