Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఒకే వేదిక‌ పైకి రాహుల్, బాబు

 తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో కలిసి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఒకే వేదికను పంచుకొనే అవకాశం ఉంది. 

prajakutami plans to rahul gandhi and chandrababu meetings in telangana
Author
Hyderabad, First Published Nov 19, 2018, 7:01 PM IST


హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో కలిసి టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఒకే వేదికను పంచుకొనే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికల్లో ప్రజా కూటమి( మహా కూటమి)లో టీడీపీ కూడ భాగస్వామిగా ఉన్నందున ఈ కూటమి ప్రచారంలో భాగంగా రాహుల్‌తో కలిసి చంద్రబాబునాయుడు ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.

తెలంగాణలో టీఆర్ఎస్‌ను గద్దె దించేందుకు గాను టీడీపీ,కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ  ప్రజా కూటమిగా ఏర్పడ్డాయి.  ఈ కూటమి ఏర్పాటులో టీడీపీ కీలకంగా వ్యవహరించింది. 

మరోవైపు  కాంగ్రెస్ పార్టీతో కలిసి తొలిసారిగా  వేదికను టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడుతెలుగు రాష్ట్రాల్లో పంచుకొనే ఛాన్స్ నెలకొంది.  

గతంలో కర్ణాటక సీఎంగా  హెచ్ డీ కుమారస్వామి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో  బెంగుళూరులో జరిగిన కార్యక్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పాల్గొన్న వేదికలో చంద్రబాబునాయుడు కూడ పాల్గొన్నారు.

తెలంగాణలో ఈ  నెల 23 వ తర్వాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో  కాంగ్రస్ పార్టీ అగ్రనేతల పర్యటనలను ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో  టీడీపీ 13 స్థానాల్లో పోటీ చేస్తోంది.  టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాల్లో చంద్రబాబునాయుడు ప్రచారం నిర్వహించనున్నారు. అదే విధంగా ప్రజా కూటమి అభ్యర్థుల తరపున నిర్వహించే ఉమ్మడి సభల్లో కూడ చంద్రబాబునాయుడు  పాల్గొనే అవకాశం ఉన్నట్టు సమాచారం.

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ  తో కలిసి చంద్రబాబునాయుడు ఒకే వేదికను పంచుకొనే అవకాశం ఉంది. వీరిద్దరూ కలిసి ఒకే వేదికపై టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నారు.

కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేశారు. అనేక విషయాల్లో కాంగ్రెస్ పార్టీని టీడీపీ వ్యతిరేకించింది. అయితే  దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ పార్టీతో  కలిసి పనిచేయాల్సిన అనివార్య పరిస్థితులు తమకు నెలకొన్నాయని టీడీపీ నేతలు చెబుతున్నారు. 

తెలంగాణలో ఏర్పాటు చేసిన మహా కూటమి అభ్యర్థుల తరపున రాహుల్ తో పాటు  చంద్రబాబునాయుడు కూడ ఒకే వేదిక నుండి ప్రసంగించనున్నారు. అయితే  ఈ సభలు ఎక్కడెక్కడ నిర్వహిస్తారనే  విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.  

 

సంబంధిత వార్తలు

ప్రజాస్వామ్య రక్షణకు కలుస్తున్నాం: చంద్రబాబు

ప్రధాని ఎవరనేది అప్పుడే: దేవేగౌడతో భేటీ తర్వాత బాబు

బీజేపీయేతర ఫ్రంట్: దేవేగౌడ‌, కుమారస్వామిలతో బాబు భేటీ

బాబు ఫ్రంట్‌: ధర్మపోరాట దీక్షకు బీజేపీయేతర పార్టీలు

Follow Us:
Download App:
  • android
  • ios