Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడలేదు: చంద్రబాబు

నేను తెలంగాణలో పోటీ చేసే అవకాశం లేదు. నేను ఎక్కడున్నా... తెలంగాణ తనకు ప్రియమైన ప్రాంతమని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు

chandrababunaidu satircial comments on kcr
Author
Khammam, First Published Nov 28, 2018, 4:18 PM IST


ఖమ్మం: నేను తెలంగాణలో పోటీ చేసే అవకాశం లేదు. నేను ఎక్కడున్నా... తెలంగాణ తనకు ప్రియమైన ప్రాంతమని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు.తెలంగాణ అభివృద్ధికి తాను ఏనాడూ అడ్డుపడలేదని స్పష్టం చేశారు. కేసీఆర్ తనను ఎందుకు తిడుతున్నారో అర్ధం కాలేదన్నారు. 

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాను పనిచేస్తానని ఆయన చెప్పారు.తాను ఎక్కడైనా ఉన్నా తనకు తెలంగాణ ప్రియమైన ప్రాంతమని చంద్రబాబునాయుడు ప్రకటించారు.

రెండు రాష్ట్రాలకు సమ న్యాయం చేయాలని తాను రాష్ట్ర విభజన చేయాలని కోరినట్టు చెప్పారు. విభజన హామీ, ప్రత్యేక హోదాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్శిటీ గురించి టీఆర్ఎస్ ఎందుకు మాట్లాడదని ఆయన ప్రశ్నించారు.తనను చూపి కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారని చంద్రబాబునాయుడు ప్రస్తావిస్తూ తాను తెలంగాణలో పోటీ చేసే అవకాశం లేదన్నారు. తాను ఏపీకి సీఎంగా ఉన్నానని చెప్పారు.


దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఎన్డీయే అపహాస్యం చేస్తోందని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు విమర్శించారు. దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ నాశనం చేసిందన్నారు. ఎన్డీయేకు వ్యతిరేకంగా పార్టీలన్నీ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.  దీనికి తెలంగాణ ఎన్నికలను నాందిగా తీసుకొంటున్నట్టు చెప్పారు.

బుధవారం నాడు ఖమ్మంలో పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.చరిత్రలో ఈ ఖమ్మం చరిత్రలో నిలిచిపోతోందని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. దేశంలో ఎన్డీయేకు వ్యతిరకంగా పనిచేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

బీజేపీయేతర కూటమి ఏర్పాటును తెలంగాణ ఎన్నికల నుండి ప్రారంభించినట్టు చెప్పారు. దేశ వ్యాప్తంగా నూతన ఒరవడికి శ్రీకారం చుట్టబోతున్నట్టు చంద్రబాబునాయుడు చెప్పారు.

నాలుగున్నర ఎన్డీయే పాలనతో ఏమైనా ప్రజలకు లాభం వచ్చిందా అని చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. నోట్ల రద్దుతో పాటు ఇంకా ప్రజలు కరెన్సీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నట్టు చెప్పారు. జీఎస్టీని సరిగా అమలు చేయలేదన్నారు. దీని వల్ల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.

బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే రాజ్యాంగసంస్థలతో దాడులు చేయిస్తున్నారని చంద్రబాబునాయుడు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

ఇక కేసీఆర్‌ ఫాం హౌజ్‌కే : సురవరం సెటైర్లు

బాబు, రాహుల్ నవ్వులు: ఖమ్మం సభలో ఆసక్తికర సన్నివేశం

ఖమ్మంకు బయలుదేరిన బాబు: రాహుల్‌తో కలిసి ఎన్నికల ప్రచారం

ఖమ్మం నుండి బాబు, రాహుల్ ఎన్నికల ప్రచారం

రంగంలోకి బాబు: రాహుల్‌తో పాటు తెలంగాణలో ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఒకే వేదిక‌ పైకి రాహుల్, బాబు

ప్రజాస్వామ్య రక్షణకు కలుస్తున్నాం: చంద్రబాబు

ప్రధాని ఎవరనేది అప్పుడే: దేవేగౌడతో భేటీ తర్వాత బాబు

బీజేపీయేతర ఫ్రంట్: దేవేగౌడ‌, కుమారస్వామిలతో బాబు భేటీ

బాబు ఫ్రంట్‌: ధర్మపోరాట దీక్షకు బీజేపీయేతర పార్టీలు

Follow Us:
Download App:
  • android
  • ios