బెంగుళూరు: కేంద్రంలోని బీజేపీ సర్కార్  రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు. ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరనేది అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకొంటామన్నారు.

 ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో  కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు.మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామితో చర్చించిన తర్వాత గురువారం సాయంత్రం బెంగుళూరులో మాజీ ప్రధాని దేవేగౌడతో కలిసి చంద్రబాబు  మీడియాతో మాట్లాడారు. 

జనవరి 19వ తేదీన నిర్వహించే ర్యాలీకి మమత బెనర్జీ ఆహ్వానించారని చంద్రబాబునాయుడు చెప్పారు. రేపు చెన్నైకు వెళ్లి స్టాలిన్‌ను కలవనున్నట్టు చంద్రబాబునాయుడు ప్రకటించారు. నోట్ల రద్దు జరిగి రెండేళ్లు దాటినా కూడ ఇంకా నగదు కష్టాలు తీరలేదని బాబు చెప్పారు. ఆర్బీఐ, సీబీఐ, ఈడీ, ఐటీ లాంటి సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేసిందని బాబు ఆరోపించారు.

తమకు వ్యతిరేకంగా పార్టీలను, విపక్షాలను కంట్రోల్ చేసేందుకు ఈడీని ప్రయోగించేందకు ప్రయత్నిస్తోందని బాబు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమని... ఆ పార్టీలో కలిసి పనిచేస్తామని చంద్రబాబు చెప్పారు. దేవేగౌడ లాంటి నేతలు  సహకారం  తమకు ఎంతో అవసరమని బాబు అభిప్రాయపడ్డారు. 

బీజేపీకి వ్యతిరేకంగా సెక్యులర్ పార్టీలను ఏకం చేసేందుకు చంద్రబాబునాయుడు   మాజీ ప్రధాని దేవేగౌడ చెప్పారు.బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు కోసం  చంద్రబాబునాయుడు ప్రయత్నాలను దేవేగౌడ అభినందించారు.సెక్యులర్ పార్టీ‌లను  మరింత ముందుకు తీసుకెళ్లాలని దేవేగౌడ చంద్రబాబును కోరారు.

లౌకికవాద పార్టీలన్నీ ఏకం కావాల్సిన సమయం ఏర్పడిందన్నారు. రాజ్యాంగబద్ద సంస్థలను బీజేపీ నాశనం చేస్తోందన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. 

మోడీని గద్దె దించేందుకు ఈ శక్తులు  ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉందన్నారు.త్వరలో జరిగే నాలుగు రాష్ట్రాల ఎన్నికల తర్వాత  దేశంలో రాజకీయ పరిణామాలు మరింత మారే అవకాశం ఉందని దేవేగౌడ అభిప్రాయపడ్డారు. దేశంలో 1996 నాటి పరిస్థితులు కన్పిస్తున్నాయని కర్ణాటక సీఎం కుమారస్వామి అభిప్రాయపడ్డారు. చంద్రబాబునాయుడు ఎత్తుగడలు వ్యూహత్మకంగా ఉంటాయన్నారు.
 

 

సంబంధిత వార్తలు

బీజేపీయేతర ఫ్రంట్: దేవేగౌడ‌, కుమారస్వామిలతో బాబు భేటీ

బాబు ఫ్రంట్‌: ధర్మపోరాట దీక్షకు బీజేపీయేతర పార్టీలు