బెంగుళూరు: జేడీఎస్ చీప్,మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ‌, కర్ణాటక సీఎం  కుమారస్వామిలతో గురువారం నాడు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బెంగుళూరులోని  దేవేగౌడ నివాసంలో భేటీ అయ్యారు.

బీజేపీయేతర కూటమి ఏర్పాటు విషయంలో  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నాలు ప్రారంభించారు.ఇందులో భాగంగానే దేవేగౌడ,  కుమారస్వామిలతో  చంద్రబాబునాయుడు చర్చించనున్నారు. కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికగా బీజేపీయేతర పార్టీలకు వేదికగా మారింది.

కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో కూడ బీజేపీయేతర పార్టీల ఫ్రంట్ ఏర్పాటు విషయమై చంద్రబాబునాయుడు వారం రోజుల క్రితం చర్చించారు. ఈ ఫ్రంట్ ఏర్పాటును వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో  బాబు ఇవాళ బెంగుళూరుకు వెళ్లాడు.

రెండు మూడు రోజుల  తర్వాత చంద్రబాబునాయుడు  తమిళనాడు రాష్ట్రానికి కూడ వెళ్లనున్నారు. డీఎంకె చీఫ్ ఎంకె స్టాలిన్ తో  చంద్రబాబునాయుడు సమావేశం కానున్నారు. బీజేపీయేతర పార్టీల ఫ్రంట్‌లో చేరాలని డీఎంకెను ఆహ్వానించనున్నారు.
 

సంబంధిత వార్తలు

బాబు ఫ్రంట్‌: ధర్మపోరాట దీక్షకు బీజేపీయేతర పార్టీలు