అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఖమ్మంలో జరిగే ఎన్నికల సభలో పాల్గొనేందుకు బుధవారం నాడు హెలికాప్టర్ లో బయలు దేరారు.కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబునాయుడు ఈ సభలో పాల్గొంటారు.

తెలంగాణలో పీపుల్స్ ప్రంట్ లో టీడీపీ భాగస్వామిగా ఉంది.ఈ కూటమి ఏర్పాటులో టీడీపీ కీలక పాత్ర పోషించింది. తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని చంద్రబాబునాయుడు బుధవారం నుండి ప్రారంభించనున్నారు.

ఖమ్మంలో జరిగే సభలో  కాంగ్రెస్ పార్టీ చీఫ్  రాహుల్ గాంధీతో కలిసి చంద్రబాబునాయుడు పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ ఏర్పాటైంది. అయితే దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో బీజేపీయేతర పార్టీల కూటమి ఏర్పాటులో కూడ టీడీపీ కీలక పాత్ర పోషిస్తోంది.

దరిమిలా కాంగ్రెస్ పార్టీతో టీడీపీ చేతులు కలిపింది. కాంగ్రెస్ పార్టీ సహకారంతో బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటుకు బాబు వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాహుల్ తో కలిసి చంద్రబాబునాయుడు ఖమ్మం జిల్లాలో జరిగే ఎన్నికల సభలో పాల్గొంటారు.

సంబంధిత వార్తలు

ఖమ్మం నుండి బాబు, రాహుల్ ఎన్నికల ప్రచారం

రంగంలోకి బాబు: రాహుల్‌తో పాటు తెలంగాణలో ప్రచారం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: ఒకే వేదిక‌ పైకి రాహుల్, బాబు

ప్రజాస్వామ్య రక్షణకు కలుస్తున్నాం: చంద్రబాబు

ప్రధాని ఎవరనేది అప్పుడే: దేవేగౌడతో భేటీ తర్వాత బాబు

బీజేపీయేతర ఫ్రంట్: దేవేగౌడ‌, కుమారస్వామిలతో బాబు భేటీ

బాబు ఫ్రంట్‌: ధర్మపోరాట దీక్షకు బీజేపీయేతర పార్టీలు