Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీదేవికి సంబంధం ఇదే

  • తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జూన్ 2న జరిగింది
  • శ్రీదేవి జీవితంలో మరపురాని ఘట్టం జూన్ 2
What is common between sridevi and telangana

సినీ నటి శ్రీదేవికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు విడదీయలేని బంధం ఉంది. అదేంటి ఆమె సినీ స్టార్. తెలంగాణ ఏర్పాటు అనేది పొలిటికల్ ఇష్యూ కదా? ఈరెండు అంశాల మధ్య రిలేషన్ ఎలా ఉంటుందబ్బా అనుకుంటున్నారా? అయితే చదవండి.

దశాబ్దాల పోరాటం విజయవంతమై 2014, జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అయితే అదేరోజు అందాల తార దివంగత శ్రీదేవి పెళ్లి కూడా అయింది. శ్రీదేవికి బోనీ కపూర్ కు పెళ్లి అయిన తేదీ జూన్ 2. దీంతో ఈ రెండు ఒకే తేదీన ఉండడం యాదృచ్ఛికమే కావొచ్చు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తేదీనాడు మాత్రం శ్రీదేవి పెళ్లి అంశం కూడా చర్చలోకి రావడం సహజమే.

శ్రీదేవికి బోనీ కపూర్ కంటే ముందే మిథున్ చక్రవర్తితో మొదటి పెళ్లి 1985లో అయినట్లు బాలీవుడ్ వర్గాల్లో ఇప్పటికీ టాక్ నడుస్తున్నది. అయితే వారిద్దరికీ పడకపోవడంతో వారు వేరు పడ్డారని చెబుతారు. మిథున్ చక్రవర్తి తన మొదటి భార్య ఉండగానే శ్రీదేవిని పెళ్లి చేసుకున్నారని అంటున్నారు. అయితే మిథున్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడంలో ఆలస్యం చేయడంతో శ్రీదేవి ఆయననుంచి దూరమైనట్లు చెబుతారు. తర్వాత జూన్ 2వ తేదీ, 1996లో బోనీకపూర్ తో శ్రీదేవికి వివాదం జరిగింది. అప్పటికే బోనీకపూర్ కు మొదటి పెళ్లి జరిగిపోయింది. 

అయితే బాలీవుడ్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం బోనీ కపూర్ తో పెళ్లి కంటే ముందే వారిద్దరూ సుమారు మూడేళ్ల పాటు సహజీవనం చేశారని చెబుతారు. ఈ నేపథ్యంలో పెళ్లి కంటే ముందే శ్రీదేవి బోనీ కపూర్ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇద్దరూ అన్నిరకాలుగా దగ్గరయ్యారు. ఆ క్రమంలో కొద్దిరోజుల్లోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కంటే ముందే శ్రీదేవి గర్భవతి అయినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నమాట.

ఇక జూన్ 2న పెళ్లి చేసుకున్న ఈ జంట సినీ చరిత్రలోనే ది బెస్ట్ జంటగా నిలిచారు. కానీ అనూహ్యంగా శ్రీదేవి దుబయ్ లో చనిపోవడం యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఆవేదనకు గురి చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios