తెలంగాణ ప్రభుత్వం ధాన్యం సేకరణకు రెడీ అయిన నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎఫ్‌సీఐ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత రా రైస్ ఇచ్చినా కొనుగోలు చేయాలని ఆయన ఆదేశించారు.  

ఎఫ్‌సీఐ అధికారులతో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత రా రైస్ (raw rice) ఇచ్చినా తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. దీనిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో (piyush goyal) మాట్లాడతానని కిషన్ రెడ్డి అధికారులకు తెలిపారు. 40.20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. 

కాగా.. తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లు శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు గ్రామాల్లో Paddy ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తోంది ప్రభుత్వం. Punjab రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేసినట్టుగానే Telanganaలో కూడా వరి ధాన్యం కొనుగోలు చేయాలనే TRS సర్కార్ డిమాండ్‌ను కేంద్రం పట్టించుకోలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

రాష్ట్రంలోని 36 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం ఉత్పత్తి అయినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. గత వారం 10 రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వరి కోతలు సాగుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మార్కెట్లోకి వరి ధాన్యం వచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వరి ధాన్యం సేకరించేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయమై ఆయా జిల్లాల్లో అధికారులు చర్యలు చేపట్టారు. ఏ జిల్లాల్లో ఏ మేరకు వరి ఉత్పత్తి అవుతుందనే విషయం ఆధారంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సాధారణ రకం వరికి క్వింటాలుకు రూ. 1940 చెల్లించనున్నారు. ఏ గ్రేడ్ వరి ధాన్యానికి రూ. 1960 చెల్లించనున్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయడం వల్ల రాష్ట్ర ఖజానాపై సుమారు రూ. 5 వేల కోట్లు అదనంగా భారం పడే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో నూకలు ఎక్కువగా అవుతాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో నూకలు ఎక్కువగా అవుతాయి. సాధారణంగా క్వింటాలు వరి ధాన్యం మిల్లింగ్ చేస్తే 50 కిలోల బియ్యం 17 కిలోల నూకలు వస్తాయి. అదే యాసంగిలో అయితే క్వింటాల్ వరిని మిల్లింగ్ చేస్తే 17 కిలోల నూకలకు మరో 17 కిలోలు తోడౌతాయి. అంటే బియ్యం 36 కిలోలు మాత్రమే వస్తాయి.

బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. నూకలను ఏం చేయాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ప్రతి క్వింటాల్ పై ప్రభుత్వానికి రూ.400 నుండి రూ.500 భారం పడే అవకాశం ఉందని సమాచారం. వరి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినందున రైతులు ఎవరూ కూడా తక్కువ ధరకు తమ ధాన్యాన్ని విక్రయించవద్దని రైతులను కేసీఆర్ కోరారు.వరి ధాన్యం కొనుగోలు విషయంలో కంద్రం అనుసరించిన వైఖరిని కేసీఆర్ తప్పుబట్టారు. 

ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఏ రైతు తన పొలంలో ఏ పంటను వేశారనే సమాచారం వ్యవసాయశాఖాధికారుల వద్ద ఉంది. దీని ఆధారంగా వరి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మరో వైపు ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రంలోకి వరి ధాన్యం రాకుండా సరిహద్దుల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేయనున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీష్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో తెలంగాణ పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు.