హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  టీఆర్ఎస్  ప్రభంజనం వీస్తోందని  తెలంగాణ అపద్ధర్మ మంత్రి కేటీఆర్  అభిప్రాయపడ్డారు.  లగడపాటి రాజగోపాల్, చంద్రబాబులు  తెలంగాణ ఫలితాను ప్రభావితం చేసేందుకు మైండ్ గేమ్ ఆడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.డిసెంబర్ 11వ, తేదీ తర్వాత లగడపాటి చిలక జోస్యం చెప్పుకోవాల్సిందేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

బుధవారం సాయంత్రం మంత్రి కేటీఆర్  మీడియాతో చిట్ చాట్ చేశారు. రాష్ట్రంలోని  20 నుండి 22 అసెంబ్లీ నియోజకవర్గాలను ఎంపిక చేసి  సర్వే చేసి ఇవ్వాలని తాను ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో  లగడపాటి రాజగోపాల్‌ను కోరినట్టు  చెప్పారు. ఈ 23 అసెంబ్లీ సెగ్మెంట్లలో 19 స్థానాల్లో  టీఆర్ఎస్ విజయం  సాధిస్తోందని  లగడపాటి రాజగోపాల్  తమకు చెప్పారని కేటీఆర్  మీడియాకు వివరించారు.

అక్టోబర్ 20 నుండి నవంబర్ 20 వరకు  రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించినట్టు  చెప్పారు. టీఆర్ఎస్ 65 నుండి 70 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని  లగడపాటి రాజగోపాల్  తనకు మేసేజ్ చేసినట్టు  కేటీఆర్ గుర్తు చేసుకొన్నారు.

  అయితే లగడపాటి రాజగోపాల్  చెప్పిన సీట్ల కంటే ఎక్కువ సీట్లను కైవసం చేసుకొంటామని తాను  లగడపాటికి మేసేజ్ పంపానన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  మీ ప్రతిభను చూశానని రాజగోపాల్ తనకు కితాబిచ్చారని చెప్పారు. లగడపాటి రాజగోపాల్‌‌కు తనకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్లను బయటపెట్టినట్టు కేటీఆర్ తెలిపారు.

ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సెంచరీ కొడుతుందన్నారు. 100 సీట్లు గెలవటం ఖాయమన్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 24 సీట్లు ఉంటే.. 17 చోట్ల టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. అయితే టీఆర్ఎస్ విజయం సాధిస్తోందని విషయం తెలిసి చంద్రబాబునాయుడు, లగడపాటి రాజగోపాల్‌లు మైండ్ గేమ్‌ ఆడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.

పెప్పర్ స్ప్రేతో తెలంగాణ రాష్ట్రాన్ని  లగడపాటి రాజగోపాల్ ఆపలేదన్నారు. మైండ్‌గేమ్‌తో  తెలంగాణ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేరన్నారు.డిసెంబర్ 11వ తేదీ తర్వాత లగడపాటి రాజగోపాల్‌కు దిమ్మ తిరిగిపోతోందన్నారు. ఆ తర్వాత లగడపాటి చిలకజోస్యం చెప్పుకొంటూ ఉండాలన్నారు.  డిసెంబర్ 11వ తర్వాత రెండు చిలకలను లగడపాటికి పంపుతానని చెప్పారు. జోస్యం చెప్పేందుకు  లగడపాటి రాజగోపాల్ కు ఈ చిలకలను పంపుతామన్నారు.

సంబంధిత వార్తలు

టీడీపీతో పొత్తుకు లగడపాటి యత్నం: కేటీఆర్ సంచలనం

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబును వదులుకోవద్దని కేటీఆర్‌కు చెప్పా: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల