హైదరాబాద్: తెలంగాణలో టీడీపీని వదులుకోవడం వల్ల  టీఆర్ఎస్‌కు నష్టమని  తాను ముందే  కేటీఆర్‌కు వివరించినట్టు  విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చెప్పారు. కానీ, టీడీపీని వదులుకోవడం వల్ల టీఆర్ఎస్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నట్టు ఆయన గుర్తు చేశారు.

బుధవారం నాడు ఆయన హైద్రాబాద్‌లో  మీడియాతో మాట్లాడారు.  ఈ ఏడాది సెప్టెంబర్ 15 లేదా 16 తేదీల్లో కేటీఆర్‌ తనను కలిశారని ఆయన గుర్తు చేసుకొన్నారు.
తన సమీప బంధువు ఇంట్లో కేటీఆర్‌ కలిశారని ఆయన చెప్పారు. ఆ సమయంలో చంద్రబాబునాయుడును (టీడీపీని) కలుపుకుపోవాలని తాను కేటీఆర్ కు సూచించినట్టు చెప్పారు.

అయితే కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐలు కూటమిగా ఏర్పడడం వల్ల  టీఆర్ఎస్‌కు నష్టం జరుగుతోందన్నారు. గతంలో టీడీపీకి చెందిన 20 శాతం ఓటు బ్యాంకు టీఆర్ఎస్‌కు వెళ్లిపోయిందన్నారు. కానీ, క్రమంగా టీడీపీ ఓటు బ్యాంకు తిరిగి వస్తోందని ఆయన తెలిపారు.

టీఆర్ఎస్‌కు, కాంగ్రెస్ కు మధ్య సుమారు 10 శాతం ఓట్ల తేడా ఉందన్నారు. అయితే సీపీఐ, టీడీపీ, టీజేఎస్ కలవడం వల్ల కూటమికి ప్రయోజనం కలిగే ఛాన్స్ ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

టీడీపీతో కలుపుకుపోవడం వల్ల రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని  తాను కేటీఆర్‌కు వివరించానన్నారు. అయితే కూటమి ఏర్పడడం వల్ల  రాజకీయంగా  టీఆర్ఎస్‌కు పరోక్షంగా నష్టం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.  అయితే  టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోలేదన్నారు. అయితే అది ఆ పార్టీ ఇష్టమని లగడపాటి  చెప్పారు.

అయితే చంద్రబాబునాయుడును వదులుకోవద్దని  తాను  కేటీఆర్ కు స్నేహితుడిగానే  సమాధానం చెప్పానని ఆయన  గుర్తు చేశారు. అయితే ఏ కారణాలతో వారు  తమను వదులుకొన్నారో తనకు తెలియదన్నారు.

 

సంబంధిత వార్తలు

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల