తెలంగాణలో  తమతో  టీడీపీ పొత్తు పెట్టుకోనేలా విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రయత్నించారని  టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్  చెప్పారు. 


హైదరాబాద్: తెలంగాణలో తమతో టీడీపీ పొత్తు పెట్టుకోనేలా విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రయత్నించారని టీఆర్ఎస్ నేత మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ పొత్తు బెడిసి కొట్టడంతో సర్వేల పేరుతో మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారన్నారు. చంద్రబాబునాయుడుతో పాటు ఇద్దరు మీడియా అధిపతులతో కలిసి రాజగోపాల్ సర్వే నివేదికను మార్చేశారని కేటీఆర్ ఆరోపించారు.

బుధవారం సాయంత్రం మంత్రి కేటీఆర్ బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో టీడీపీ పొత్తుకు లగడపాటి రాజగోపాల్ విశ్వ ప్రయత్నాలు చేశారని కేటీఆర్ ఆరోపించారు. నందమూరి హరికృష్ణ చనిపోయిన సందర్భంలో తాము వెళ్లిన సమయంలో కూడ పొత్తు ప్రస్తావనను తీసుకొచ్చారని చెప్పారు.

తమతో టీడీపీ ప్రతిపాదనను తాను అంగీకరించలేదన్నారు. బావ మరిది శవం వద్ద రాజకీయాలు మాట్లాడిన వ్యక్తి చంద్రబాబునాయుడు అని కేటీఆర్ విమర్శించారు. ఈ ఏడాది సెప్టెంబర్ మాసంలో టీడీపీతో టీఆర్ఎస్ పొత్తు కోసం లగడపాటి రాజగోపాల్ తీవ్రంగా ప్రయత్నించారని ఆయన గుర్తు చేశారు. 

తమకు కామన్ ఫ్రెండ్ దగ్గర సమావేశమైన సమయంలో టీడీపీతో పొత్తు ప్రతిపాదన చేసినట్టు చెప్పారు. ఈ ప్రతిపాదనను తాను అంగీకరించలేదన్నారు. దీంతో కాంగ్రెస్ టీడీపీల మధ్య పొత్తును లగడపాటి కుదిర్చారని చెప్పారు. ప్రజా కూటమి ఏర్పాటులో లగడపాటి రాజగోపాల్ క్రియాశీలకంగా ప్రయత్నించారని చెప్పారు.

సంబంధిత వార్తలు

క్లూ ఇచ్చిన లగడపాటి: గజ్వేల్‌లో కేసీఆర్ డౌట్

కేటీఆర్‌కు ఆ విషయం చెప్పా, నేనేమీ మార్చలేదు: లగడపాటి

చంద్రబాబును వదులుకోవద్దని కేటీఆర్‌కు చెప్పా: లగడపాటి

చంద్రబాబు కోసమే లగడపాటి సర్వే: కేటీఆర్ ట్వీట్

లగడపాటి సర్వే ఎఫెక్ట్: అసదుద్దీన్ తో కేసీఆర్ దోస్తీ అందుకే...

లగడపాటి అసలు సర్వే ఇదీ, నాకు పంపాడు: గుట్టు విప్పిన కేటీఆర్

లగడపాటి సర్వే సంకేతాలివే: కేసీఆర్ కు నో కేక్ వాక్

లగడపాటి సర్వే: మరో ముగ్గురు స్వతంత్రుల పేర్లు విడుదల