అమ్నేషియా పబ్ కేసు: నివేదిక కోరిన తెలంగాణ గవర్నర్ తమిళిసై

జూబ్లీహిల్స్ పోలీస్ స్టేసన్ పరిధిలోని అమ్నేషియా పబ్  నుండి తీసుకెళ్లి మైనర్ బాలికపై సామూహి అత్యాచారానికి పాల్పడిన ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై రాష్ట్రప్రభుత్వాన్ని నివేదిక కోరారు.  రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరారు. 

Telangana Governor Tamilisai Soundararajan Orders To Give Report on Amnesia Pub Gang Rape Issue

హైదరాబాద్:Jubilee hills పోలీస్ స్టేషన్ పరిధిలోని Amnesia పబ్ నుండి మైనర్ బాలికను తీసుకెళ్లి సామాూహిక అత్యాచార ఘటనపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ గవర్నర్ Tamilisai soundararajan రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆమె చెప్పారు. గ్యాంగ్ రేప్ ఘటనపై రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Somesh kumar, డీజీపీ Mahender Reddy లను ఆదేశించారు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.  మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా నివేదిక కోరారు గవర్నర్ తమిళిసై.

ఈ ఏడాది మే 28వ తేదీన అమ్నేషియా పబ్ లో గెట్ టూ గెదర్ పార్టీ చేసుకున్న విద్యార్ధులు సాయంత్రం ఐదు గంటలకు పబ్ నుండి బయటకు వెళ్లిపోయారు. అయితే పబ్ లోనే ఓ Minor Girl ను ట్రాప్ చేసిన ఆరుగురు యువకులు కారులో తీసుకెళ్లారు. ఆ తర్వాత కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టుగా బాలిక పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో పేర్కొంది.ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

also read:అత్యాచార ఘటన వీడియోలు రఘునందన్ రావు వద్దకు ఎలా వచ్చాయి?: ఆ మూడు పార్టీలు ఒకటేనన్న కాంగ్రెస్

ఈ ఏడాది మే 4వ తేదీన హైద్రాబాద్ నగరంలోని సరూర్ నగర్ లో నాగరాజును అతని భార్య ఆశ్రిన్ సుల్తానా సోదరులు అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి  మే 6వ తేదీన సరూర్ నగర్ పరువు హత్యపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నివేదిక కోరారు.

అమ్నేషియా పబ్ కేసు రాష్ట్రంలో కలకలం రేపుతుంది. ఈ కేసులో ప్రజా ప్రతినిధుల పిల్లలున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు  కారులో చోటు చేసుకున్న ఘటనలకు సంబంధించి ఫోటోలను మీడియా సమావేశంలో విడుదల చేయడం కలకలం రేపింది.  నిందితులు ఉపయోగించిన ఇన్నోవా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నగర శివారు ప్రాంతమైన మొయినాబాద్‌లో ఈ కారును పోలీసులు గుర్తించారు. అనంతరం క్లూస్ టీమ్ సాయంతో పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నారు. అత్యాచారం ఇందులోనే జరగడంతో కేసు దర్యాప్తులో ఇన్నోవా కీలకంగా మారింది. 

ఓ కార్పోరేట్ స్కూల్ పేరుతో ఉస్మాన్ అనే విద్యార్ధి ఫేర్‌వెల్ పార్టీకి అనుమతి తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 150 మంది విద్యార్ధుల కోసం పబ్ బుక్ చేసి ఇందుకోసం రూ.2 లక్షలు చెల్లించారు.

అయితే తాము ఎవరికీ మద్యం సరఫరా చేయలేదని కూల్‌డ్రింక్‌లు మాత్రమే ఇచ్చినట్లు పబ్ నిర్వాహకులు చెబుతున్నారు. అమ్నేషియా ఘటన విషయమై  వస్తున్న ఆరోపణలపై హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు.ప్రతిపక్ష పార్టీల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. మైనర్లు కావడంతోనే చర్యలకు ఆలస్యం అవుతుందని చెప్పారు. నిందితులు మైనర్లు కావడంతో పోలీసులు వారి పరిధిలో విచారణ జరుపుతున్నారని వెల్లడించారు. పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారని చెప్పారు..అత్యాచారం కేసులో ఇద్దరు మైనర్లతో సహా ముగ్గురు నిందితులను పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios