చివరి జాబితాలోనైనా పేరుంటుందా.. ఢిల్లీ వైపు కాంగ్రెస్ ఆశావహుల చూపు

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తన చివరి జాబితాను ఈరోజు ప్రకటించనుంది. ఇప్పటికే రెండు విడతలుగా 75 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్...మిగిలిన 19 స్థానాల భవితవ్యాన్ని నేడు తేల్చనుంది.

Telangana Elecetions: congress Anounces final list today

తెలంగాణ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ తన చివరి జాబితాను ఈరోజు ప్రకటించనుంది. ఇప్పటికే రెండు విడతలుగా 75 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్...మిగిలిన 19 స్థానాల భవితవ్యాన్ని నేడు తేల్చనుంది. తుది కసరత్తులో భాగంగా టీపీసీసీ నేతలు.. టికెట్ ఆశిస్తున్న నేతలు ఢిల్లీ చేరుకున్నారు.

ముఖ్యంగా టీపీసీసీ మాజీ చీఫ్ పొన్నాలతో పాటు కుమారుడికి టికెట్ ఆశిస్తున్న సీనియర్ నేత జానారెడ్డి హైకమాండ్‌తో సంప్రదింపులు జరుపుతున్నారు. దీనిలో భాగంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో జానారెడ్డి సమావేశంకానున్నారు. రాహుల్‌తో సమావేశం తర్వాత తుది జాబితాను టీపీసీసీ ప్రకటించనుంది. దీంతో ఆశావహులు లాబీయింగ్‌ మొదలుపెట్టారు.

మరోవైపు జనగామ సీటు తనదేనని.. తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేస్తున్నారు పొన్నాల.. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. జనగామ నుంచి కోదండరామ్ పోటీ చేస్తారనేది కేవలం ప్రచారమేనని.. కూటమిలోని సీపీఐ, టీజేఎస్ సీట్ల కేటాయింపులపై పూర్తి స్థాయి నిర్ణయం జరగలేదన్నారు. ఇదే విషయంపై కోదండరామ్ మాట్లాడుతూ... జనగామ సీటు ఇంకా ఎవరికి కేటాయించలేదన్నారు. దీంతో ఫైనల్ లిస్ట్ కోసం పొన్నాల ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

పొన్నాలకు దక్కని టికెట్ ... కార్యకర్త ఆత్మహత్యాయత్నం

కాంగ్రెస్ రెండో జాబితా: తేలని పొన్నాల సీటు

కాంగ్రెస్‌తో తేలని పంచాయితీ: మిత్రుల స్థానాల్లో టీజేఎస్ పోటీ

కాంగ్రెస్ లోకి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు:టచ్ లో ఉన్నారన్న రేవంత్

కాంగ్రెస్, టీఆర్ఎస్ సీట్ల కేటాయింపు: రెడ్లదే పై చేయి

సీట్ల సర్దుబాటు: కాంగ్రెస్‌కు కోదండరామ్ డెడ్‌లైన్

ఒక ఊరికి మూడు సీట్లు: కాంగ్రెసు అధిష్టానం ఉదారత

కోదండరామ్ ఎలా గెలుస్తాడో చెప్పండి: పొన్నాల సవాల్

కేసీఆర్ మీద పోరు: ప్రజా కూటమి లెక్కలు ఇవీ...

టీడీపీలో ఉంటే.. నాకు టికెట్ దక్కేది..మాజీ మంత్రి

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios