టీడీపీలో ఉంటే.. నాకు టికెట్ దక్కేది..మాజీ మంత్రి
తాను పార్టీ మారకుండా టీడీపీలోనే కొనసాగి ఉండి ఉంటే తనకు సీటు దక్కి ఉండేదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ఆవేదన వ్యక్తం చేశారు
తాను పార్టీ మారకుండా టీడీపీలోనే కొనసాగి ఉండి ఉంటే తనకు సీటు దక్కి ఉండేదని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నేతగా పోటీ చేసిన ఆయన ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు.
కాగా.. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ విడుదల చేసిన రెండు జాబితాల్లో సుద్దాల దేవయ్యకు చోటు దక్కలేదు. దీంతో తనను దారుణంగా మోసం చేశారంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీలో ఉన్న తనను టికెట్ ఇస్తామని మరీ పిలిచి కాంగ్రెస్ లో చేర్చుకున్నారని, తీరా ఎన్నికలు వచ్చేసరికి టికెట్ ఇవ్వకుండా మోసం చేశారన్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న తనకు కాకుండా, గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కని వ్యక్తికి టికెట్ కేటాయించడం చాలా బాధగా ఉందన్నారు.
పొన్నం ప్రభాకర్ ని నమ్మి కాంగ్రెస్ లో చేరితే.. ఇంత దారుణంగా మోసం చేస్తారని అనుకోలేదని ఆయన అన్నారు. తన నియోజకవర్గంలో తనకు బలం చాలా ఉందని.. వేరే పార్టీలో చేరి ఎన్నికల్లో పోటీచేసి తీరతానని ఆయన తెలిపారు.