కొత్త మున్సిపల్ చట్టంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కొత్త పురపాలక చట్టంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

మజ్లిస్ కోసం టీఆర్ఎస్ సర్కార్ కొత్త పురపాలక చట్టాన్ని తీసుకొస్తొందని లక్ష్మణ్ ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్‌లకు బీజేపీ అంటే భయం పట్టుకుందని తాము అసెంబ్లీలో లేకపోయినా తలచుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో ప్రజలు తిరగబడితే ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను కేసీఆర్ బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికకు సంబంధించి మాట్లాడుతూ.. టికెట్ కోసం ఎనిమిది మంది పోటీపడుతున్నారని లక్ష్మణ్ వెల్లడించారు.

తెలంగాణ కోసం బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను తాము కలవలేదని.. ఆమె కూడా బీజేపీని సంప్రదించలేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. అభ్యర్ధుల జాబితాను పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు పంపుతామని ఆయన పేర్కొన్నారు. 

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్ధి ఈమెనే

గెలుపు మనదే,50 వేల మెజారిటీ రావాలి: సైదిరెడ్డితో కేసీఆర్

హుజూర్ నగర్ చాలా హాట్ గురూ..: కేసీఆర్ కు సవాల్ ఇదే...

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: బిజెపిలోకి కాసోజు శంకరమ్మ?

హుజూర్‌నగర్ బైపోల్: సీపీఐ, జనసేన మద్దతుకు ఉత్తమ్ ప్రయత్నాలు

సైదిరెడ్డి స్థానీయత: ఉత్తమ్ ప్రకటనలోని ఆంతర్యం ఇదే...

శానంపూడి సైదిరెడ్డి ఆంధ్రవాడా: ఉత్తమ్ కుమార్ రెడ్డి భాష్యం అదే

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: జానా రెడ్డి కొడుక్కి బీజేపీ గాలం

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డే

హుజుర్ నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల : అక్టోబర్ 21న పోలింగ్

హుజూర్ నగర్ ఉప ఎన్నిక: మళ్లీ తెర మీదికి కాసోజు శంకరమ్మ

జగదీష్ రెడ్డి వ్యాఖ్య: రేవంత్ రెడ్డితో మాట్లాడించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే

హుజూర్ నగర్ అభ్యర్థి: అన్న మాటను కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి