ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిగ్ ఫైట్ నెలకొంది. 

కొడంగల్: ఉమ్మడి మహాబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బిగ్ ఫైట్ నెలకొంది. కొడంగల్‌ నుండి మూడో సారి రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు.రెండు దపాలు ఈ స్థానం నుండి రేవంత్ రెడ్డి టీడీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. మూడోసారి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్నారు. తొలిసారిగా 2009 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఈ స్థానం నుండి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.

2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనేక రాజకీయ సమీకరణాల్లో మార్పులు చోటు చేసుకొన్నాయి. గత ఏడాది చివర్లో రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను చంద్రబాబునాయుడుకు ఇచ్చారు. కానీ ఆ రాజీనామా లేఖ స్పీకర్ కార్యాలయానికి చేరలేదు. ఆ సమయంలోనే కొడంగల్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతాయని భావించారు.

ఈ సమయంలో ఉప ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డిని ఓడించేందుకుగాను మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో మరో నలుగురు మంత్రులు కొడంగల్‌లోనే మకాం వేశారు. కొడంగల్‌లో అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టారు. రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరులను ఆపరేషన్‌ ఆకర్ష్ కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్‌లో చేర్చుకొన్నారు. కానీ, రేవంత్ రెడ్డి రాజీనామా స్పీకర్ కార్యాలయానికి చేరలేదు. ఈ లోపుగా తెలంగాణ అసెంబ్లీని కేసీఆర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.

దరమిలా కొడంగల్‌లో ప్రస్తుతం బిగ్‌ఫైట్ నెలకొంది. కొడంగల్‌ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా రేవంత్ రెడ్డి బరిలోకి దిగుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్ధిగా రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేంద్ రెడ్డి బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఈ స్థానం నుండి పలు దఫాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గుర్నాథరెడ్డి విజయం సాధించారు.కానీ 2009లో గుర్నాథరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గుర్నాథరెడ్డిపై పోటీ చేసి విజయం సాధించారు.

2014 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టీడీపీ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని కోరుకొన్నారు. కానీ, ఆనాడు మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని మల్లారెడ్డికి చంద్రబాబునాయుడు కేటాయించారు. మల్కాజిగిరి ఎంపీ స్థానం దక్కితే కొడంగల్‌ నుండి తన సోదరుడిని బరిలోకి దింపాలని రేవంత్ భావించారు.కానీ, ఆనాటి పరిస్థితుల కారణంగా రేవంత్ కొడంగల్‌ నుండి బరిలోకి దిగాల్సి వచ్చింది. గత ఏడాది నాటికి రాజకీయ పరిస్థితుల్లో మార్పుల కారణంగా రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కొడంగల్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా రేవంత్ పోటీలోకి దిగుతున్నారు.

అసెంబ్లీని రద్దు చేయడం కంటే ముందే కొడంగల్‌కు ఉప ఎన్నికలు వస్తాయనే భావనతో అధికార పార్టీ ఇబ్బడి ముబ్బడిగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు. కొడంగల్‌లో అభివృద్ధి పనులను టీఆర్‌ఎస్‌ హోరెత్తించింది. 

ఇటీవలి కాలంలో ఇబ్బడిముబ్బడిగా నిధులు మంజూరు చేసింది. పంచాయతీరాజ్‌ రోడ్లకు రూ.194 కోట్లు, ఆర్‌అండ్‌బీ రోడ్లకు రూ.100 కోట్లు మంజూరు చేయగా పనులు కొనసాగుతున్నాయి. కొడంగల్‌, కోస్గి, మద్దూరుల్లోని ప్రభుత్వాసుపత్రుల భవనాల నిర్మాణానికి రూ.18 కోట్లు మంజూరయ్యాయి. కొడంగల్‌, కోస్గి మునిసిపాలిటీలకు రూ.30 కోట్లు; కోస్గిలో బస్‌ డిపోనకు రూ.3 కోట్లు మంజూరు చేశారు. 

రేవంత్‌ రెడ్డి గెయిల్‌ అందజేసిన రూ.5 కోట్లతో కొడంగల్‌, కోస్గి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు సొంత భవనాలు నిర్మించారు. కోస్గిలో ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటు చేశారు. ఆయన హయాంలోనే కోస్గికి బస్‌ డిపో మంజూరైంది. సొంత డబ్బులతో మూడెకరాలు కొనుగోలు చేసి డిపోకి ఇచ్చారు. 

రేవంత్ సోదరులు తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, రమేశ్‌రెడ్డికి ఆయా మండలాల ప్రచార బాధ్యతలు అప్పగించారు. రేవంత్ ఎక్కువగా రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

ఇదిలా ఉంటే కొడంగల్ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. కానీ, ఓటర్లు తక్కువగా ఉంటారు.కానీ, మెజారిటీ ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం లేకపోలేదు. మరో వైపు టీఆర్ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి విజయం కోసం మంత్రి హరీష్ రావు మంత్రాంగం నడిపిస్తున్నారు. సోదరుడి కోసం మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడ కొడంగల్‌పై ప్రత్యేకంగా కేంద్రీకరించారు.

"

సంబంధిత వార్తలు

2014లో జీరో: ఆ తర్వాతే రేవంత్‌పై కేసుల చిట్టా

కేసీఆర్ గురి: రేవంత్‌పైకి హరీష్, జీవన్‌రెడ్డిపై కవిత

వైఎస్ కేబినెట్‌లో చేరేవాడిని, టీఆర్ఎస్‌ నుండి ఆఫర్: రేవంత్

దమ్ము, ధైర్యం ఉంటే నాపై గెలువు: రేవంత్‌కు నరేందర్ రెడ్డి సవాల్

రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?
స్పీకర్ ఫార్మాట్ లో ఎమ్మెల్యే పదవికి రేవంత్ రాజీనామా

ముందు నన్ను దాటు...తర్వాతే చంద్రబాబు : కేసీఆర్ కు రేవంత్ సవాల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి విచారణ వెనక...

రేవంత్ విచారణపై ఎపి ఇంటలిజెన్స్ ఆరా, ఏం అడిగారంటే..

ఈరోజుకు సెలవ్, 23న మళ్లీ రండి: ముగిసిన రేవంత్ రెడ్డి విచారణ

ఓటుకు నోటు కేసుతో మానసిక క్షోభ అనుభవిస్తున్నా:మత్తయ్య

కేసీఆర్ బాగోతం బయటపెట్టినందుకే దాడులు.. శవాలపై వ్యాపారం జరుగుతోంది: రేవంత్

రేవంత్ విచారణ: ఓటుకు నోటు కేసులో చంద్రబాబు టార్గెట్?