Asianet News TeluguAsianet News Telugu

మైనర్ బాలికపై మూడు రోజులుగా.. 69యేళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి అత్యాచారం..!!

ఈ అఘాయిత్యంతో కడుపునొప్పిని భరించలేకపోయిన బాలిక తన తండ్రికి జరిగిన విషయాన్ని వెల్లడించడంతో మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం ఉన్నత విద్య విభాగంలో రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న అరవైతొమ్మిదేళ్ల బి బిక్షపతిని పోలీసులు అరెస్టు చేశారు. 

Telangana : 69-year-old retired govt employee rapes minor girl, arrested
Author
Hyderabad, First Published Oct 20, 2021, 10:47 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హనుమకొండ : వరంగల్ లో దారుణం జరిగింది. కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ (KUC) పోలీస్ స్టేషన్ పరిధిలో 13 ఏళ్ల మైనర్ బాలికపై రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఒకరు sexually assaultedకి పాల్పడ్డాడు.

ఈ అఘాయిత్యంతో కడుపునొప్పిని భరించలేకపోయిన బాలిక తన తండ్రికి జరిగిన విషయాన్ని వెల్లడించడంతో మంగళవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం సాయంత్రం ఉన్నత విద్య విభాగంలో రిటైర్డ్ సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న అరవైతొమ్మిదేళ్ల బి బిక్షపతిని పోలీసులు అరెస్టు చేశారు. 

బిక్షపతి హనంకొండ జిల్లాలోని వడ్డేపల్లికి చెందిన పరిమళ కాలనీ రోడ్ నెం .8 లో నివాసం ఉంటున్నాడు. బాధితురాలి తండ్రి స్థానిక వైద్యుని సంప్రదించగా, బాలికను పరీక్షించిన వైద్యుడు ఆమె లైంగిక దాడి జరిగినట్లు తెలిపాడు. దీంతో అతను Kakatiya University Campus పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

బాధితురాలి తండ్రి కథనం ప్రకారం, గత మూడు రోజులుగా నిందితుడు బాలిక ఒంటరిగా ఉన్నప్పుడు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మీడియాతో మాట్లాడిన కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్ ఇన్స్‌పెక్టర్ కె. జనార్ధన రెడ్డి మాట్లాడుతూ.. నిందితుడిపై "లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంతో సహా చట్టంలోని వివిధ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేయబడింది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు పంపించాం." అని తెలిపాడు. కడుపు నొప్పి భరించలేక బాలిక తన తండ్రికి జరిగిన విషయాన్ని వెల్లడించడంతో సంఘటన వెలుగులోకి వచ్చిందని అన్నారు. 

గాంధీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం: మంటలను అదుపులోకి తెచ్చిన ఫైరింజన్లు

ఇదిలా ఉంటే... మరో ఘటనలో కర్నాటకలో వాకింగ్ కు వెళ్లిన వ్యక్తి మీద అత్యాచారం జరిగింది. దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరు పద్ధతికి చెందిన 20 ఏళ్ల యువకుడు శుక్రవారం సాయంత్రం సరదాగా వాకింగ్ కి వెళ్ళాడు.  స్థానిక రైల్వే ట్రాక్ వద్ద అదే గ్రామానికి చెందిన మహమ్మద్ అనే వ్యక్తి తారసపడ్డాడు.  చెరుకు రసం తాగుదాం రమ్మంటూ యువకుడిని నమ్మించి సమీపంలోని  పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.

విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఇంటికి వచ్చిన అతడు భయపడుతూ ఉండడం, విచిత్రంగా ప్రవర్తించడాన్ని గమనించిన తండ్రి ఏం జరిగిందని ప్రశ్నించాడు. మొదట విషయం చెప్పడానికి భయపడ్డాడు. తండ్రి ధైర్యం చెప్పడంతో తన మీద జరిగిన అఘాయిత్యాన్ని చెప్పుకొచ్చాడు. దీంతో ముందు షాక్ అయిన తండ్రి.. ఆ తరువాత తేరుకున్నాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో accused హనీఫ్ ను అరెస్టు చేశారు.

బస్సు కోసం ఎదురు చూస్తుంటే...
అదే విధంగా మరో ఘటనలో బెల్గాం జిల్లా కు చెందిన 24 ఏళ్ల యువకుడు పై sexual assault జరిగింది.  అంతాని అనే పట్టణానికి చెందిన వ్యక్తి హోటల్లో హెల్పర్ గా పనిచేస్తుంటాడు. ఈ నెల 5వ తేదీన పని ముగించుకుని బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు.  అదే సమయంలో గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి  యువకుణ్ని బైక్ మీద తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు రాజును అరెస్టు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios