సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో బుధవారం నాడు ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది.ఈ అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే ఫైర్ ఫైటర్లకు సమాచారం ఇచ్చారు.ఫైరింజన్లు వెంటనే వచ్చి మంటలను ఆర్పివేశాయి.
హైదరాబాద్: సికింద్రాబాద్ లోని Gandhi Hospitalలో బుధవారం నాడు ఉదయం స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్‌తో విద్యుత్ ప్యానెల్‌లో మంటలు వ్యాపించాయి. వెంటనే ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.అగ్ని ప్రమాదం కారణంగా నాలుగో అంతస్తు నుంచి మొదటి అంతస్తు వరకు పెద్ద ఎత్తున్న మంటలు వ్యాపించాయి. గాంధీ ఆస్పత్రి సిబ్బంది మంటలను గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
also read:కూతురి ప్రేమ వివాహం.. తండ్రి పగ: 8 మంది సజీవదహనం, మృతుల్లో నలుగురు చిన్నారులు
ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి Talasani Srinivas Yadav గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ డాక్టర్ Rajaraoతో ఫోన్‌లో మాట్లాడారు. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అడిగి తెలుసుకొన్నారు.
Huzuirabad bypoll ప్రచారంలో ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఫోన్ లో డాక్టర్ రాజారావుకు పలు సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూపరింటెండ్ ను ఆదేశించారు.
హైద్రాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత తాను ఆసుపత్రిని సందర్భిస్తానని మంత్రి వివరించారు.ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది స్పందించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఫైర్ ఫైటర్లు వచ్చి మంటలను ఆర్పివేశారు.
