బట్టలు కొనడానికి తల్లి డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాచలం ఏఎంసీ కాలనీకి చెందిన శివప్రసాద్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.
బట్టలు కొనడానికి తల్లి డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాచలం ఏఎంసీ కాలనీకి చెందిన శివప్రసాద్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ రోజు బట్టలు కొనుక్కోవాలని తల్లి రమణను డబ్బులు అడిగాడు..
ఆమె తన వద్ద ఉన్న రూ.200 ఇచ్చింది.. ఇవి చాలవని, ఇంకా కావాలని అడగటంతో తన వద్ద లేవని మరోసారి ఇస్తానని చెప్పింది.. దీంతో మనస్తాపానికి గురైన శివప్రసాద్ బాత్‌రూమ్‌లోకి వెళ్లి బెల్టుతో ఉరేసుకున్నాడు. అతను ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచింది..
వారు బాత్‌రూమ్ తలుపులు పగలగొట్టి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే కిందకి దించి ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. చేతికి అంది వచ్చిన కొడుకు విగతజీవిగా మారడంతో తల్లి కన్నీరుమున్నీరవుతోంది.
