విద్యార్థులకు పోర్న్ వీడియోలు చూపిస్తూ...అలా చేయాలని వేధిస్తున్న స్కూల్ టీచర్...

teacher sexual harassment in hyderabad
Highlights

అతడు బాధ్యాతాయుతమైన టీచర్ వృత్తిలో ఉన్నాడు. విద్యార్థులు తప్పుడు మార్గంలో నడవకుండా చూస్తూ దిశానిర్దేశం చేయాల్సింది పోయి అతడే దారితప్పాడు. తాను పాఠాలు చెప్పే విద్యార్థులను తన బిడ్డలుగా చూసుకోవాల్సిన అతడు వారితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వారికి అశ్లీల వీడియోలు చూపిస్తూ వేధించసాగాడు. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఈ విషయం తెలపడంతో వారు ఈ కీచక టీచర్ కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు.

హైదరాబాద్ లోని డిడి నగర్ కాలనీ చైతన్య స్కూళ్లో రమేశ్ అనే వ్యక్తి టీచర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇతడు అదే పాఠశాలలోని విద్యార్థులను లైంగికంగా వేధించేవాడు.  విద్యార్థినులను ఒంటరిగా తన వద్దకు పిలుచుకుని వారికి పోర్న్ సినిమాలు చూపించేవాడు. ఇలా లంచ్ టైమ్ లో విద్యార్థిలను వేధించడంతో పాటు ఆ వీడియోల్లో మాదిరిగా చేయాలంటూ అసభ్యంగా మాట్లాడేవాడు. ఇలా చేస్తే మంచి మార్కులు వేస్తానని, లేదంటే ఫెయిల్ చేస్తానని బెదిరింపులకు దిగేవాడు.

ఉపాధ్యాయుడి వేధింపులను భరించలేక విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో ఇవాళ స్కూల్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు ఉపాధ్యాయుడు రమేష్ ని పట్టుకుని చితకబాదారు. స్కూల్ పర్నీచర్ ని ద్వంసం చేసి నిరసనకు దిగారు. ఈ ఘటనపైయ సమాచారం అందుకున్న పోలీసులు స్కూల్ వద్దకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులను సముదాయించారు. రమేశ్ ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

loader