- Home
- Telangana
- Hyderabad : ఈ శివారు ప్రాంతం మరో గచ్చిబౌలి కావడం ఖాయం.. ఇప్పుడే భూములు కొన్నారో మీ జాతకమే మారిపోతుంది
Hyderabad : ఈ శివారు ప్రాంతం మరో గచ్చిబౌలి కావడం ఖాయం.. ఇప్పుడే భూములు కొన్నారో మీ జాతకమే మారిపోతుంది
Hyderabad Real Estate : హైదరాబాద్ మహానగరం వేగంగా విస్తరిస్తోంది.. దీంతో చూస్తుండగానే శివాారుప్రాంతాలు డెవలప్ అవుతున్నాయి. ఇలా భవిష్యత్ లో మరో గచ్చిబౌలిలా మారే అవకాశాలున్న ప్రాంతమేదో తెలుసా..?

హైదరాబాద్ శివారులో రియల్ బూమ్ ఖాయం..
హైదరాబాద్... కోట్లాది రూపాయల ఆస్తిపాస్తులున్న బడాబాబులకే కాదు పొట్టచేత పట్టుకుని వచ్చే నిరుపేదలకు కూడా ఆశ్రయం కల్పిస్తుంది. మధ్యతరగతి ప్రజలు జీవించేందుకు పర్పెక్ట్ సిటీ... బెంగళూరు వంటి నగరాలతో పోలిస్తే జీవన వ్యయం చాలా తక్కువ. అందుకే నిత్యం తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలు, చిన్నచిన్న పట్టణాల నుండి హైదరాబాద్ కు వలసలు కొనసాగుతున్నాయి... లక్షలాదిమంది ఉపాధి, ఉద్యోగాలు పొందతున్నారు.
ఇలా నగరంలో జీవించే మధ్యతరగతి ప్రజలు రూపాయి రూపాయి పోగేసి మంచి లాభాలు వచ్చే ప్రాపర్టీ కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. అలాంటివారికి ఇదే మంచి అవకాశం. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ డల్ గా ఉంది... కాబట్టి భూముల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడే కాస్త తెలివిగా భూమిపై పెట్టుబడులు పెడితో భవిష్యత్ లో భారీ లాభాలు తెచ్చిపెడతాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల భవిష్యత్ లో మంచి డిమాండ్ ఉండే ప్రాంతాలేవో తెలుసుకుందాం.
ఈ ప్రాంతం మరో గచ్చిబౌలి కావడం ఖాయం...
ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఆబిడ్స్, కోఠి, హిమాయత్ నగర్, పంజాగుట్ట, నాంపల్లి వంటి ప్రాంతాలే... కానీ నగరం విస్తరించి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలు పుట్టుకొచ్చాయి. ఇక ఐటీ డెవలప్మెంట్ తర్వాత నగర రూపరేఖలే మారిపోయాయి... హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, గచ్చిబౌలి వంటి శివారు ప్రాంతాలు మెయిన్ సిటీగా మారిపోయాయి.
అయితే హైదరాబాద్ విస్తరణ ఇంతటితో ఆగిపోలేదు.. రోజురోజుకు మరింత విస్తరిస్తూనే ఉంది. ఈ క్రమంలో నగర శివారులోని కొన్ని ప్రాంతాలు ఊహకందని విధంగా మారనున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. షాబాద్, షాద్ నగర్ ప్రాంతాలు చాలా వేగంగా డెవలప్ అవుతున్నాయని.. ఇక్కడి భూములకు త్వరలోనే రెక్కలురావడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రాంతం మరో గచ్చిబౌలిలా మారే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే చందనవెల్లి, సీతారాంపూర్ సెజ్ లను ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా డెవలప్ కానుంది.. ముఖ్యంగా ఐటీ, ఫార్మా కంపెనీలకు కేంద్రంగా మారనుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చెపడుతున్న ''ఫ్యూచర్ సిటీ'' తో పాటు మూసీ ప్రాజెక్టులతో అనుసంధానం చేయనున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవేల్, బుల్లెట్ రైలు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రణాళికలు రూపొందించారు.
ఇలా షాబాద్, షాద్ నగర్ పరిసరాలు వేగంగా డెవలప్ అవుతున్నాయి. రాబోయే ఐదేళ్లలో ఈ ప్రాంతం గుర్తుపట్టలేనివిధంగా తయారవుతుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి ఇప్పుడే ఈ ప్రాంతంలో భూమలపై పెట్టుబడలు పెడితే భవిష్యత్ లో మంచి లాభాలుంటాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.
ముంబై హైవే పరిసరాల్లో భూములకు రెక్కలు...
ప్రస్తుతం హైదరాబాద్ లో ముంబై హైవే చుట్టుపక్కల ప్రాంతాలు ఊహకందని విధంగా డెవలప్ అయ్యాయి. కూకట్ పల్లి నుండి లిగంపల్లి, పటాన్ చెరు వరకు ఇళ్లస్థలాలు, అపార్ట్ మెంట్ ప్లాట్స్ ధరలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఈ హైవే వెంట సంగారెడ్డి, సదాశివపేట ప్రాంతాల్లో భూముల ధరలు కాస్త తక్కువగా ఉన్నాయి. నగరం విస్తరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్ లో ఈ ప్రాంతాల్లోనూ భూముల ధరలు పెరిగే అవకాశాలున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి హైదరాబాద్ లో కోట్లు పెట్టి ఇళ్లు, స్థలాలు కొనలేనివారు ఈ శివారు ప్రాంతాల్లో కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. రాబోయే ఐదు పదేళ్లలో నగరం సంగారెడ్డి వరకు విస్తరించడం ఖాయం... అప్పుడు భూముల ధరలు పెరగడం కూడా ఖాయం.
మిడిల్ క్లాస్ పీపుల్స్ కి ఇస్నాపూర్ మంచి ఆప్షన్
హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై ఉన్న ఇస్నాపూర్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు స్వర్గం లాంటింది. ఈ ప్రాంతం హైదరాబాద్ కు అతి సమీపంలో ఉంది... పటాన్ చెరు పారిశ్రామికవాడకు కూతవేటు దూరంలో ఉంటుంది. అందుకే ఇది కార్మికులకు అడ్డాగా మారింది. ఈ ప్రాంతం కూడా భవిష్యత్ లో మరింత డెవలప్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి... కాబట్టి ఇక్కడ భూములు, ఇళ్ల స్థలాల కొనుగోలు మంచి లాభాలు తెచ్చిపెడుతుందని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది ఇస్నాపూర్ లో ఇళ్లు కట్టుకుని రెంట్లకు ఇచ్చి హాయిగా బ్రతుకున్నారు... భారీగా అపార్ట్ మెంట్స్ వెలుస్తున్నాయి. భవిష్యత్ లో ఈ ప్రాంతం మన ఊహలకు అందనివిధంగా తయారవుతుంది.
భూమిపై పెట్టుబడులు పెట్టండి..
భూతల్లి నమ్ముకుంటే ఎప్పుడూ నష్టం ఉండదని పెద్దలు చెబుతుంటారు... ఈ నిజాన్ని నేటి వ్యాపారులు గ్రహించారు. అందుకే భూములపై భారీగా పెట్టుబడులు పెట్టి లాభాలను పొందుతున్నారు. ఇప్పుడిప్పుడే మధ్యతరగతి ప్రజలు కూడా భూములపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. భవిష్యత్ బాగుండాలంటే ఇళ్ల స్థలాలు, భూములు కొనుగోలు చేసి పెట్టుకోవాలని... హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ పని చేస్తే నిశ్చింతంగా ఉండవచ్చని అంటున్నారు.
గమనిక: పైన తెలిపిన వివరాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి లేదా భూములు, ఇళ్లు కొనుగోలు చేసే ముందు నిపుణులు సలహాలు తీసుకోవడం మంచిది.

