MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Telangana
  • Ramzan Holidays : ఈ శుక్రవారమా లేక శనివారమా..? తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ సెలవు ఎప్పుడు..?

Ramzan Holidays : ఈ శుక్రవారమా లేక శనివారమా..? తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ సెలవు ఎప్పుడు..?

School Holidays : ఆంధ్ర ప్రదేశ్ హాలిడే క్యాలెండర్ లో రంజాన్ సెలవు మార్చి 20న ఉంది… అదే తెెలంగాణ క్యాలెండర్ లో అయితే మార్చి 21, 22 సెలవులున్నాయి… దీంతో కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. మరి రంజాన్ ఎప్పుడు..? 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 18 2026, 05:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రంజాన్ సెలవులు..
Image Credit : Gemini AI

రంజాన్ సెలవులు..

Ramdhan Holidays : రంజాన్ పండగ ఎప్పుడు... మార్చి 20 శుక్రవారమా..? మార్చి 21 శనివారమా..? ఈ కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. రేపు (మార్చి 19న) రంజాన్ పండగ ఎప్పుడనేది క్లారిటీ రానుంది. గురువారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపిస్తే శుక్రవారం పండగ జరుపుకుంటారు... లేదంటే శనివారమే రంజాన్ జరుగుతుంది. ముస్లిం మతపెద్దలు రంజాన్ ఎప్పుడు జరుపుకోవాలో నిర్ణయించి అధికారికంగా ప్రకటిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆంధ్ర ప్రదేశ్ లో శుక్రవారమే సెలవు..
Image Credit : Getty

ఆంధ్ర ప్రదేశ్ లో శుక్రవారమే సెలవు..

ప్రభుత్వ అధికారిక క్యాలెండర్ 2026 ప్రకారం ఏపీలో మార్చి 20నే రంజాన్ పండగ. దేశవ్యాప్తంగా ఈ పండగను అదేరోజు జరుపుకుంటే ఎలాంటి ఇబ్బందిలేదు... యధావిధిగా విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు ఉంటుంది. ఒకవేళ పండగ మారితే సెలవు కూడా మారుతుంది.

మార్చి 19న కాకుండా 20న నెలవంక కనిపిస్తే రంజాన్ పండగను మార్చి 21న జరుపుకుంటారు. ఈ క్రమంలో ఇదేరోజును సెలవు ఉంటుంది... ఇదే జరిగితే మార్చి 22 ఆదివారం సెలవు కలిసివస్తుంది... దీంతో రంజాన్ కు వరుసగా రెండ్రోజులు సెలవులు ఇచ్చినట్లుగా ఉంటుంది. రేపటి నెలవెంక దర్శనంపై ఏపీలో రంజాాన్ సెలవు ఆధారపడి ఉంటుంది.

Related Articles

Related image1
Ramadan Charity ఇది కదా రంజాన్ పుణ్యం అంటే.. పిల్లల కోసం రూ.లక్షలు వెచ్చించిన టీచర్లు!
Related image2
Haleem: రంజాన్ స్పెషల్ హలీమ్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసా?
35
తెలంగాణలో రంజాన్ కు రెండ్రోజుల సెలవులు...
Image Credit : unsplash

తెలంగాణలో రంజాన్ కు రెండ్రోజుల సెలవులు...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండక్కి రెండ్రోజులు సెలవులు ఇచ్చింది. మార్చి 21 (శనివారం) రంజాన్ పండగ సెలవుగా ప్రకటించింది... పండగ తర్వాతరోజు అంటే మార్చి 22న కూడా సెలవు ఇచ్చింది. అయితే ఈరోజు ఎలాగూ ఆదివారమే కాబట్టి సాధారణ సెలవు ఉంటుంది.

రంజాన్ పండగ మార్చి 20 (శుక్రవారం) జరిగితే తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు కూడా ఆరోజు సెలవు ఇచ్చే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే ఇంకో సెలవు ఎక్ట్రా వస్తుంది. ఇలా తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులకు మార్చి 20, 21, 22 వరుసగా మూడ్రోజుల రంజాన్ సెలవులు కలిసివచ్చే అవకాశాలున్నాయి.

45
అసలు రంజాన్ ఎప్పుడు..?
Image Credit : Getty

అసలు రంజాన్ ఎప్పుడు..?

తెలుగు రాష్ట్రాల్లో రంజాన్ ఉపవాస దీక్షలు ఫిబ్రవరి 19న ప్రారంభం అయ్యాయి. అంటే సరిగ్గా నెలరోజులకు మార్చి 19న ముగుస్తాయి. ఈరోజే నెలవంక కనిపిస్తే మార్చి 20న రంజాన్ జరగుతుంది... కానీ మార్చి 19 అమావాస్య కాబట్టి నెలవంక కనిపించకపోవచ్చు. అందుకే మార్చి 20న నెలవంక దర్శనం జరిగితే మార్చి 21 దేశవ్యాప్తంగా ముస్లిం ప్రజలు రంజాన్ పండగను జరుపుకుంటారు.

గల్ఫ్ దేశాల్లో రంజాన్ ఓరోజు ముందుగానే జరగనుంది. కువైట్, సౌదీ అరేబియా వంటి అరబ్ దేశాల్లో ఫిబ్రవరి 18న రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. కాబట్టి మార్చి 18 అంటే నేటితో ఉపవాసం ముగుస్తుంది. రేపు (మార్చి 19, గురువారం) ఈ దేశాల్లో రంజాన్ జరుపుకుంటారు. ఇండియాలో ఒకటి లేదా రెండ్రోజులు ఆలస్యంగా రంజాన్ జరుపుకునే అవకాశాలున్నాయి.

55
మార్చి 27న మరో సెలవు...
Image Credit : Getty

మార్చి 27న మరో సెలవు...

ఈ వీకెండ్ ఉగాది, రంజాన్ సెలవులతో ముగుస్తుంది. ఇక తర్వాత వీకెండ్ కూడా లాంగ్ వీకెండ్ గా మారనుంది. మార్చి 27 (శుక్రవారం) శ్రీరామ నవమి పండగ ఉంది... కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో అధికారిక సెలవు ఉంటుంది. ఇక శని, ఆదివారం ఎలాగూ ఉద్యోగులకు సెలవు ఉంటుంది... ఇలా మూడురోజులు సెలవులు వస్తాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశం
పండుగలు
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 4 రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్
Recommended image2
Telangana: క‌నీస‌వేత‌నం రూ. 16 వేల‌కు పెంపు.. 1.10 కోటి మందికి ప్ర‌యోజ‌నం
Recommended image3
Telangana: ఇదీ బీఆర్ఎస్ అస‌లు రూపం.. ద‌ళితులు నిర‌స‌న తెలిపితే, శుద్ధి చేస్తారా.?
Related Stories
Recommended image1
Ramadan Charity ఇది కదా రంజాన్ పుణ్యం అంటే.. పిల్లల కోసం రూ.లక్షలు వెచ్చించిన టీచర్లు!
Recommended image2
Haleem: రంజాన్ స్పెషల్ హలీమ్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved