
అధికార కాంగ్రెస్ బిగ్ షాక్ .. మాజీ మంత్రి రాజీనామా..? అసలు కారణమేంటో తెలుసా?
Jeevan Reddy : ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే... మూడుసార్లు మంత్రిగా పనిచేశారు. తెలంగాణలో భారత రాష్ట్ర సమితి హవా కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఎమ్మెల్సీగా గెలిచారు. చివరకు తెలంగాణ కాంగ్రెస్ (TPCC) అధ్యక్ష రేసులో కూడా నిలిచారు. ఇలా దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎందుర్కొంటున్నారు. పార్టీలో సరైన గౌరవం, గుర్తింపు దక్కకపోవడంతో దాదాపు 40 ఏళ్ళుగా మోసిన కాంగ్రెస్ కండువాను ఇక దించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది.