హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి రేఖా నాయక్ గురువారం నాడు నామినేషన్  దాఖలు చేశారు.

తెలంగాణ తొలి అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్ రెడ్డి పనిచేశారు. ఈ దఫా ఈ పదవికి రేఖా నాయక్‌ నామినేషన్ దాఖలు చేశారు.స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు విపక్షాలు పోటీ చేయడం లేదు. దీంతో స్పీకర్‌తో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి కూడ  ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే స్పీకర్ పదవికి పోచారం  శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవికి రేఖా నాయక్  నామినేషన్ ను దాఖలు చేశారు.స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసే సమయంలో  కేసీఆర్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే  మల్లు భట్టి విక్రమార్క, ఎంఐఎం తరపున బలాల  నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

నేనొస్తేనే బెదురుతున్నారు, కేసీఆర్ వస్తున్నాడు: బాబుపై తలసాని

టీఆర్ఎస్ నేతల ఏపీ టూర్లపై టీడీపీ నేతలకు బాబు అల్టిమేటం

జగన్, కేసీఆర్ దోస్తీపై చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం

జగన్, కేసీఆర్ దోస్తీకి టీడీపీ కౌంటర్ వ్యూహం

బయటపడింది: కేటీఆర్, జగన్ భేటీ:పై లోకేష్ వ్యాఖ్యలు

జగన్‌, కేటీఆర్ భేటీపై దేవినేని ఉమ: టార్గెట్ టీఆర్ఎస్ ఎంపీ కవిత

దోస్తీకి రెడీ: కేటీఆర్‌తో కలిసి జగన్ మీడియా సమావేశం

కేసుల కోసం కేసీఆర్‌కు జగన్ పాదాక్రాంతం: దేవినేని