Asianet News TeluguAsianet News Telugu

నేనొస్తేనే బెదురుతున్నారు, కేసీఆర్ వస్తున్నాడు: బాబుపై తలసాని

బంధాలు, బంధుత్వాలు చంద్రబాబునాయుడుకు ఏం తెలుసునని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఏపీ రాష్ట్రంలో తాను చాలా జిల్లాల్లో పర్యటించనున్నట్టు  చెప్పారు.

trs mla talasani srinivas yadav reacts on chandrababu comments
Author
Hyderabad, First Published Jan 17, 2019, 3:27 PM IST

హైదరాబాద్: బంధాలు, బంధుత్వాలు చంద్రబాబునాయుడుకు ఏం తెలుసునని టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఏపీ రాష్ట్రంలో తాను చాలా జిల్లాల్లో పర్యటించనున్నట్టు  చెప్పారు. చంద్రబాబునాయుడు హెచ్చరిస్తే ఆ పార్టీలో బీసీలు ఎవరూ కూడ ఉండరని చెప్పారు. 

గురువారం నాడు అసెంబ్లీలో మీడియా పాయింట్‌లో  తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.బంధాలు, బంధుత్వాలు, నైతిక విలువల గురించి  చంద్రబాబుకు ఏం తెలుసునని తలసాని ఎద్దేవా చేశారు. బంధువనే చంద్రబాబును ఎన్టీఆర్ చేరదీశాడని.. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని వీధినపడేశారని చెప్పారు.

దుర్గగుడి ఆలయంలో మీడియా పాయింట్ వద్దే తాను మాట్లాడానని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.తాను రాజకీయాలే మాట్లాడుతానని తలసాని స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్రంలో తప్పకుండా రాజకీయాలు చేస్తామని తలసాని స్పష్టం చేశారు. మొన్న చెప్పిన దాని కంటే  అంతకంటే ఎక్కువగా  రాజకీయాల గురించి చెబుతానని చెప్పారు.

ఏపీలోని తమ కమ్యూనిటీ నేతలతో పాటు  బీసీ  సామాజిక వర్గాలకు కూడ  ఈ విషయాన్ని చెబుతానని తలసాని హెచ్చరించారు. ఏపీ ఎన్నికల్లో  మా ప్రమేయం ఉంటుందని చెప్పారు. ధైర్యంగా ఏపీకి వస్తామన్నారు. తెలంగాణలో ఏ రకంగా అభివృద్ది ఎలా జరుగుతోందో వివరించనున్నామని తలసాని చెప్పారు.

తెలంగాణ ఎన్నికల్లో  టీడీపీ కాంగ్రెస్ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకొందో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు మూల్యాం చెల్లించుకోవాల్సిన  రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు.

ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఏపీ ప్రజలు  ఆశగా ఎదురు చూస్తున్నారని  చెప్పారు. ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం చంద్రబాబునాయుడుకు అలవాటేనని  తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. ఏపీ హక్కుల కోసం మేం మద్దతు ఇస్తామని చెప్పారు. 

తనకు ఏపీలో బంధుత్వాలు ఉన్నాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. చిల్లర రాజకీయాలు చేసే అవసరం తమకు లేదన్నారు.ఎప్పుడూ చిల్లర రాజకీయాలు చేయడం చంద్రబాబుకు అలవాటు తలసాని విమర్శించారు.

త్వరలోనే కేసీఆర్ ఏపీ రాష్ట్రంలో పర్యటించనున్నారని తలసాని చెప్పారు. చంద్రబాబులా కుట్ర రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 26 కులాలను తొలగించిన అంశంపై బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అభివృద్ధి ఎలా చేయాలో ఏపీ రాష్ట్ర పర్యటనకు వచ్చే కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవాలని బాబుకు హితవు పలికారు.

కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొన్నందుకు టీడీపీని ఓడించేందుకు ఎన్టీఆర్ అభిమానులు సిద్దంగా ఉన్నారని తలసాని చెప్పారు. నేనొక్కడినే ఏపీలో పర్యటిస్తే బాబు భయపడుతున్నారని.... కేసీఆర్ పర్యటిస్తే ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చునని చెప్పారు.


సంబంధిత వార్తలు

టీఆర్ఎస్ నేతల ఏపీ టూర్లపై టీడీపీ నేతలకు బాబు అల్టిమేటం

జగన్, కేసీఆర్ దోస్తీపై చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం

జగన్, కేసీఆర్ దోస్తీకి టీడీపీ కౌంటర్ వ్యూహం

బయటపడింది: కేటీఆర్, జగన్ భేటీ:పై లోకేష్ వ్యాఖ్యలు

జగన్‌, కేటీఆర్ భేటీపై దేవినేని ఉమ: టార్గెట్ టీఆర్ఎస్ ఎంపీ కవిత

దోస్తీకి రెడీ: కేటీఆర్‌తో కలిసి జగన్ మీడియా సమావేశం

కేసుల కోసం కేసీఆర్‌కు జగన్ పాదాక్రాంతం: దేవినేని

 

Follow Us:
Download App:
  • android
  • ios