అమరావతి: జగన్‌ను అడ్డుపెట్టుకొని  ఏపీలో పెత్తనం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని దేవినేని ఆరోపించారు. ఏపీ ప్రజలంతా కట్టబుట్టలతో హైద్రాబాద్‌ను వదిలివచ్చినట్టు ఆయన గుర్తు చేశారు. 

బుధవారం నాడు ఏపీ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని  జగన్ కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని చెప్పారు.

మోడీ ఫ్రంట్ నాటకాన్ని మొదలుపెట్టారని చెప్పారు.చంద్రబాబునాయుడు మీద కక్షతో ఈ ముగ్గురు మోడీలు కుట్రలు పన్నారని దేవినేని ఉమా మహేశ్వర్ రావు  ఆరోపించారు. 

కేసీఆర్ ఆంధ్ర ప్రజలను తిట్టిన మాటలు ఇంకా చెవుల్లో మార్మోగిపోతున్నాయని దేవినేని  గుర్తు చేశారు. గతంలో కేసీఆర్  ఏపీ ప్రజలను ఉద్దేశించి చేసిన విమర్శలను దేవినేని మీడియా సమావేశంలో ప్రస్తావించారు.

ఎన్నికల డబ్బులకు, కాంట్రాక్టులకు జగన్‌ కక్కుర్తిపడ్డారని దేవినేని విమర్శించారు. ఏపీ పోలీసులు జగన్‌కు వద్దు.. తెలంగాణ పోలీసులు ముద్దు అంటూ ఏద్దేవా చేశారు.

జగన్ చేస్తున్న కుట్రలు, కుతంత్రాలను ఏపీ ప్రజలు గమనిస్తున్నారని దేవినేని అభిప్రాయపడ్డారు.పోలవరం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ ఎంపీలు అడ్డుకొనే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. జగన్ తనపై ఉన్న కేసుల నుండి బయటపడేందుకు కేసీఆర్‌తో కుమ్మక్కయ్యారని దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపించారు.

ఒడిశాతో చేతులు కలిపి పోలవరం ప్రాజెక్టును అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని  దేవినేని ఆరోపించారు. ఏపీ నుండి విద్యుత్‌ను ఉపయోగించుకొని  డబ్బులు తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కేటీఆర్‌తో చర్చల సందర్భంగా విద్యుత్ బకాయిల చర్చల విషయం ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని దేవినేని ప్రశ్నించారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు. టీఆర్ఎస్‌తో కలిసి వైసీపీ చీప్ జగన్‌ ఏపీ ప్రజలకు  అన్యాయం చేసేందుకు ప్రయత్నం  చేస్తున్నారని చెప్పారు.


సంబంధిత వార్తలు

దోస్తీకి రెడీ: కేటీఆర్‌తో కలిసి జగన్ మీడియా సమావేశం